Kagaznagar: లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్ ఉచిత వైద్య సేవలు ప్రశంసనీయం

Kagaznagar: కాగజ్‌నగర్‌లో 21 రోజుల పాటు 5500 మందికి ఉచిత వైద్య సేవలందించిన లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్. ముగింపు వేడుకల్లో పాల్గొని అభినందించిన ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు.

LALITH KUMAR, SIRPUR
Published on: 5 Nov 2026 10:06 PM IST
Kagaznagar
X

Kagaznagar: లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్ ఉచిత వైద్య సేవలు ప్రశంసనీయం

కాగజ్ నగర్: కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని రైల్వే స్టేషన్లో ఈరోజు 21 రోజుల పాటు వైద్య సేవలు అందించిన లైఫ్ లైన్ ఎక్స్ ప్రెస్ వైద్య సేవల ముగింపు కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వారి సిఎస్ఆర్ సహకారంతో గత 21 రోజులుగా కాగజ్నగర్ పట్టణం , కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిసర ప్రాంతాల్లోని రోగులకు వైద్య సేవలు అందించిన లైఫ్ లైన్ ఎక్స్ ప్రెస్ సిబ్బందిని అభినందించిన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు.

5500 మందికి వైద్య సేవలు అందించడం గొప్ప విషయమని అన్నారు. 427 మందికి కంటి ఆపరేషన్లు, 55 మందికి చెవి,ముక్కు, గొంతు ఆపరేషన్లు, 12 మందికి ప్లాస్టిక్ సర్జరీలు, 5 గురికి ఎముకల సర్జరీలు మరియు 500 పైగా మందికి పంటి చికిత్సలు చేయడం గొప్ప విషయమని కొడియాడారు. 2124 మందికి ఉచితంగా కళ్ళద్దాలు ఇవ్వడం జరిగిందని వారందరూ ఎప్పటికీ ఇంపాక్ట్ ఇండియా ఫౌండేషన్ వారికి రుణపడి ఉంటారని తెలియజేశారు.

ప్రజాబంధు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 21 రోజులపాటు దాదాపు 6000 మంది రోగులకు ఉచితంగా భోజనం అందించడం జరిగిందని అన్నారు. సహకరించిన డిఎంహెచ్వో, డిసిహెచ్ఎస్, మున్సిపాలిటీ, రైల్వే సిబ్బంది, ఎస్పీఎం యాజమాన్యం వారికి అభినందనలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ యువరాజు మర్మట్, సబ్ కలెక్టర్ హర్ష చౌదరి, డిఎంహెచ్వో డా. సిడం నాగేంద్ర, డిసిహెచ్ఎస్ డా. అవినాష్, డిప్యూటీ డిఎంహెచ్వో డా. సీతారాం, ఎస్పిఎం జిఎం శ్రీమన్నారాయణ గిరి, కౌన్సిలర్ శివ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

LALITH KUMAR, SIRPUR

LALITH KUMAR, SIRPUR