Sirpur-T: సిర్పూర్-టి రైల్వే స్టేషన్‌లో 15 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం సీజ్

Sirpur-T: సిర్పూర్-టి రైల్వే స్టేషన్‌లో సింగరేణి రైలులో ఆర్పీఎఫ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ సంయుక్త తనిఖీలు. 35 బస్తాల పీడీఎస్ బియ్యం స్వాధీనం.

Venkata Thirumala
Published on: 11 Aug 2026 11:48 PM IST
Sirpur-T
X

Sirpur-T: సిర్పూర్-టి రైల్వే స్టేషన్‌లో 15 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం సీజ్

సిర్పూర్-టి: విశ్వసనీయ సమాచారం మేరకు, RPF సర్కిల్ inspector శ్రీరామ్ మీనా మరియు రాజ్‌కుమార్ DTఎన్‌ఫోర్స్‌మెంట్ ,R.దాసు ASI ల సంయుక్త బృందం సిర్పూర్-టి రైల్వే స్టేషన్‌లో , సింగరేణి రైలు నందు తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీల్లో 35 బస్తాలలో నింపిన సుమారు 15 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టుబడింది.

తనిఖీల సమయంలో సంబంధిత వ్యక్తులు బియ్యాన్ని వదిలి పరారయ్యారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేసి, సంబంధిత వ్యక్తులను గుర్తించేందుకు విచారణ చేపట్టారు.

ప్రభుత్వ రాయితీ పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలించడం, నిల్వ చేయడం లేదా దుర్వినియోగం చేయడం చట్టరీత్యా నేరం. ఇటువంటి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయి.

Venkata Thirumala

Venkata Thirumala

Next Story