Kagaznagar: కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ!

Kagaznagar: కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్ ఐపీఎస్ సోమవారం కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

LALITH KUMAR, SIRPUR
Published on: 15 Jun 2026 2:41 PM IST
Kagaznagar
X

Kagaznagar: కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ!

Kagaznagar: జిల్లా ఎస్పీ నితికా పంత్ ఐపీఎస్ గారు సోమవారం కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, లాకప్ రూమ్, రిసెప్షన్, బెల్ ఆఫ్ ఆర్మ్స్ రూమ్, స్టోర్ రూమ్, నమోదు చేసిన రికార్డులు, పెండింగ్ కేసుల పురోగతి, స్టేషన్ హాజరు రిజిస్టర్, స్టేషన్ శుభ్రత తదితర విభాగాలను పరిశీలించారు.

ఎస్పీ గారు ఎస్‌హెచ్‌ఓ సందీప్ కుమార్ తో , స్టేషన్ సిబ్బందితో సమావేశమై పలు సూచనలు చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతి పోలీసు సిబ్బందీ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, గ్రామాల్లో చట్టవ్యతిరేకచర్యలు, అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణా, మాదకద్రవ్యాలపై దృష్టి సారించాలని ఆదేశించారు.

స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదిదారుడితో, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని అన్నారు. మహిళలు, బాలికల భద్రతకు సంబంధించిన కేసుల్లో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, లా అండ్ ఆర్డర్ విషయంలో రాత్రిపూట పర్యవేక్షణ, పికెటింగ్, ప్యాట్రోలింగ్‌ను కచ్చితంగా కొనసాగించాలని సూచించారు. ప్రజాభద్రతకు విఘాతం కలిగించే వారి‌పై కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

LALITH KUMAR, SIRPUR

LALITH KUMAR, SIRPUR

Next Story