Koutala: పశువుల అక్రమ రవాణాపై ఎస్పీ నితిక పంత్ ఉక్కుపాదం
Koutala: కొమరం భీం జిల్లా ఎస్పీ నితిక పంత్ కౌటాల పశువుల విక్రయశాల మరియు పెద్దబండ చెక్‌పోస్ట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Koutala: పశువుల అక్రమ రవాణాపై ఎస్పీ నితిక పంత్ ఉక్కుపాదం
Koutala: జిల్లా ఎస్పీ నితిక పంత్ కౌటాల ప్రాంతంలోని పశువుల విక్రయశాలను పరిశీలించి అక్కడి నిర్వాహకులు మరియు సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. పశువులకు సరిపడా నీరు, దాణా, గడ్డి అందించేలా చర్యలు తీసుకోవాలని, వాటికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
అలాగే ఆవుల కొనుగోలు, అమ్మకాలు సంతలలో నిషేధమని స్పష్టం చేశారు. పశువుల రవాణా, విక్రయాలకు సంబంధించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులకు ఆదేశించారు.
అనంతరం సిర్పూర్ టి మండలంలోని పెద్దబండ చెక్‌పోస్ట్‌ను పరిశీలించిన ఎస్పీ గారు అక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారులకు, సిబ్బంది కి పలు సూచనలు అందించారు. చెక్‌పోస్ట్ వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, సరైన ధ్రువపత్రాలు లేకుండా పశువులను తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. విధుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించి అక్రమ రవాణాను అరికట్టడంలో నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు.




