Asifabad: ఆసిఫాబాద్ పోలీస్ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు!

Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలను ఎస్పీ నితికా పంత్ ఘనంగా నిర్వహించి, నివాళులర్పించారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 2 Oct 2026 3:25 PM IST
Asifabad
X

Asifabad: ఆసిఫాబాద్ పోలీస్ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు!

Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ నితికా పంత్, ఐపీఎస్‌ మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎస్పీ నితికా పంత్ మాట్లాడుతూ.. మహాత్మా గాంధీజీ భారతదేశానికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి స్ఫూర్తినిచ్చిన మహనీయుడని అన్నారు. గాంధీజీ పాటించిన సత్యం, అహింస, శాంతి, నైతిక విలువలు నేటి తరానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు.

గాంధీజీ జీవితం, ఆశయాలు, సిద్ధాంతాలపై తల్లిదండ్రులు తమ పిల్లలకు అవగాహన కల్పించాలని సూచించారు. పాఠశాలల్లోనూ విద్యార్థులకు స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీజీ పాత్ర, ఆయన పాటించిన విలువల గురించి వివరించాలని తెలిపారు. గాంధీజీ సిద్ధాంతాలను తెలుసుకొని వాటి ప్రాధాన్యతను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.

సమాజంలో శాంతి, సామరస్యాలను పెంపొందించేందుకు గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి, సేవా మార్గాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఎస్పీ సూచించారు. ప్రజలకు న్యాయం, భద్రత అందించడంలో పోలీస్ శాఖ బాధ్యతాయుతంగా పనిచేస్తూ, గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా ప్రజాసేవకు అంకితం కావాలని పోలీస్ సిబ్బందికి సూచించారు.

అనంతరం జిల్లా ప్రజలందరికీ ఎస్పీ గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ అడ్మిన్ వామనమూర్తి, ఆసిఫాబాద్ టౌన్ సీఐ నీలం రవి, జిల్లా పోలీస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్‌తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.