Sirpur: ఓటర్ల జాబితా సవరణ, నమోదుపై సర్పంచుల ఆధ్వర్యంలో సభలు!

Sirpur: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని పలు గ్రామ పంచాయతీల్లో ఓటర్ల జాబితా సవరణ, ఎస్ఐఆర్ నమోదుపై ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు.

SRINIVAS, KOUTALA
Published on: 27 Aug 2026 7:41 PM IST
Sirpur
X

Sirpur: ఓటర్ల జాబితా సవరణ, నమోదుపై సర్పంచుల ఆధ్వర్యంలో సభలు!

సిర్పూర్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజక వర్గంలో కౌటాల చింతలమానేపల్లి, పెంచికల్పేట్ మండలాల పరిధిలలో వివిధ గ్రామ పంచాయతీల కార్యాలయాలలో గ్రామ సర్పంచ్ ల ఆద్వర్యంలో SIR గ్రామ సభలు నిర్వహించారు.

ఎల్లూర్ డబ్బా ఆడేపల్లి బాబాసాగర్ బెజ్జూర్ కుస్నపల్లి ఎల్కపల్లి కన్నెపల్లి బోదంపల్లి గురుడు పేట తదితర గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రత్యేక సార్ పై గ్రామ సభలు నిర్వహించారు. SIR లో నమోదైన సరైన సమాచారం లేని ఓటర్లకు జారీ చేసిన నోటీసులు సమర్పించవలసిన ధ్రువపత్రాలపై చర్చించారు.

ఓటర్ల జాబితాలో పేరు ఉండిSIR లో నమోదు కాని వారు ఫారం 6 ద్వారా BLO లకు దరఖాస్తు చేయాలని సూచించారు. 01-10-2008 కంటే ముందు జన్మించిన యువత కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలని తెలిపారు BLO లు ప్రజా ప్రతినిధులు BLO లకు సహకరించాలని నిర్ణయించారు.

ఈ కార్యక్రమాల్లో పెంచికల్పేట్ తహసిల్దార్ రవీందర్ చింతలమానేపల్లి తహసిల్దార్ ప్రకాశ్ మరియు, వివిధ గ్రామాల సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు ప్రజా ప్రతినిధులు ప్రజలు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA

Next Story