Mancherial: పెండింగ్ సర్వే దరఖాస్తులను పరిష్కరించాలి: అదనపు కలెక్టర్
Mancherial: మంచిర్యాల జిల్లాలో పెండింగ్ సర్వే దరఖాస్తులు, భూ భారతి, భూదాన్ భూములు, కోర్టు కేసులను గడువులోగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ వి.రాములు ఆదేశించారు.
Mancherial: పెండింగ్ సర్వే దరఖాస్తులను పరిష్కరించాలి: అదనపు కలెక్టర్
మంచిర్యాల: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సర్వే దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అధికారులను ఆదేశించారు. గురువారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో రెవెన్యూ, సర్వే శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్వే దరఖాస్తుల పరిష్కారం, భూముల సర్వే పనుల పురోగతి, జీఓ నంబర్లు 76, 59 అమలు తీరు, ఎస్ఐఆర్ ప్రక్రియ, భూ భారతి, భూదాన్ భూములకు సంబంధించిన ఫైళ్లు, కోర్టు కేసులపై సమీక్షించారు. వివిధ విభాగాల్లో పెండింగ్‌లో ఉన్న పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని సూచించారు.
నిర్దేశించిన గడువులోగా అన్ని పనులు పూర్తి చేయాలని, ఎలాంటి జాప్యానికి తావివ్వకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్, కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాసరావు దేశ్‌పాండే, సబ్ కలెక్టర్ కార్యాలయ అధికారులు, తహసీల్దార్లు, సెక్షన్ సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.




