Chennur: తొలి ఏకాదశి వేళ చెన్నూర్ లో విఠలేశ్వర స్వామి పాదుకల శోభాయాత్ర

Chennur: తొలి ఏకాదశి పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి పాదుకల ఊరేగింపు వైభవంగా జరిగింది.

RAJENDER, CHENNUR
Published on: 25 July 2026 3:10 PM IST
Chennur
X

Chennur: తొలి ఏకాదశి వేళ చెన్నూర్ లో విఠలేశ్వర స్వామి పాదుకల శోభాయాత్ర

Chennur: మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ఘనంగా శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి పాదుకల ఊరేగింపు మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది.

చెన్నూర్ పట్టణానికి చెందిన శ్రీరాంబాట్ల విష్ణువర్ధన్ ఆధ్వర్యంలో స్థానిక శివాలయం మందిరం నుండి పాండురంగ విఠలేశ్వరుని పాదుకలను తీసుకొని చెన్నూరు పట్టణంలోని మాడవీధుల నుండి ఊరేగింపుగా గోదావరి నది తీరాన లోని విఠలేశ్వర స్వామి దేవాలయానికి తీసుకువెళ్లారు.

మేళతాళ మధ్య భక్తి భావనతో కూడిన భజనలతో శ్రీ విఠలేశ్వర పాదుకులను శోభయాత్ర గా నిర్వహించి గోదావరి నది తీరాన గల హనుమాన్ మందిరం సమీపంలో నూతనంగా ప్రతిష్టాపించిన శ్రీ పాండురంగ విఠలేశ్వరుని మందిరంలో ప్రతిష్టించారు.

అనంతరం, శ్రీ పాండురంగ విఠలేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న ప్రసాదాలు అందజేస్తారు. భక్తులు ఎంతో భక్తి భావనలతో ఈ శోభాయాత్రను ప్రతీయేట తొలి ఏకాదశి రోజున నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో విశ్వ హిందు మండల అధ్యక్షుడు నడిపెల్లి లక్ష్మణరావు బిజెపి పార్టీ మాజీ పట్టణ అధ్యక్షుడు జాతి తిరుపతి, భర్త జన బృందం పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RAJENDER, CHENNUR

RAJENDER, CHENNUR

Next Story