Mancherial: SIR ప్రక్రియను వెంటనే నిలిపివేయాలి: వామపక్షాల డిమాండ్

Mancherial: ఓటర్ల సవరణలో ఎస్‌ఐఆర్ ప్రక్రియను ఆపాలని, అర్హుల ఓట్లను తొలగించవద్దని డిమాండ్ చేస్తూ మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట వామపక్షాలు మహా ధర్నా చేపట్టాయి.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 1 Oct 2026 3:21 PM IST
Mancherial
X

Mancherial: SIR ప్రక్రియను వెంటనే నిలిపివేయాలి: వామపక్షాల డిమాండ్

మంచిర్యాల: ఓటర్ల సవరణ ప్రక్రియలో భాగంగా చేపట్టిన SIRను వెంటనే నిలిపివేయాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మంచిర్యాల కలెక్టరేట్‌ ఎదుట గురువారం మహా ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా వామపక్ష నాయకులు మాట్లాడుతూ.. SIR ప్రక్రియ పేరుతో అర్హులైన ఓటర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలని డిమాండ్ చేశారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నిష్పాక్షికంగా వ్యవహరించాలని, అర్హులైన ఏ ఒక్క ఓటరినీ ఓటు హక్కుకు దూరం చేయకూడదని నేతలు అన్నారు. ఎన్నికల సంఘం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఉన్నాయని వారు విమర్శించారు.

ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపు విషయంలో స్పష్టమైన విధానాలు, పూర్తి పారదర్శకత ఉండాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమైనదని, అర్హులైన ప్రతి పౌరుడి ఓటు హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని పేర్కొన్నారు.

SIR ప్రక్రియను తక్షణమే నిలిపివేయకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని వామపక్ష నాయకులు హెచ్చరించారు. ధర్నాలో పలువురు వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.