Penchikalpet: పెంచికల్ పేట్ రహదారిపై విద్యార్థులు, ఆటో యూనియన్ రాస్తారోకో!
Penchikalpet: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట్ రహదారిపై విద్యార్థులు, ఆటో యూనియన్ సభ్యుల రాస్తారోకో. ముళ్ళ పొదలు తొలగించాలని డిమాండ్.
Penchikalpet: పెంచికల్ పేట్ రహదారిపై విద్యార్థులు, ఆటో యూనియన్ రాస్తారోకో!
Penchikalpet: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట్ నుంచి బెజ్జూర్ వెళ్లే ప్రధాన రహదారిలో లోడ్పల్లి గ్రామ సమీపంలో విద్యార్థులు ఆటో యూనియన్ సభ్యులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.
ప్రధాన రహదారికి ఇరువైపులా ముళ్ళ పొదలు గడ్డి విపరీతంగా పెరిగి రోడ్డు కనిపించకుండా పోయిందని దీనివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్కూల్ కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు ఆటోలకు ముళ్ళ పొదల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వెంటనే ముళ్ళ పొదలను తొలగించి రహదారిని శుభ్రం చేయాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు.




