Kagaznagar: ర్యావరణం బాగుంటేనే మానవ మనుగడ.. సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల
Kagaznagar: కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌లో అంతర్జాతీయ ధరిత్రీ దినోత్సవం సందర్భంగా ర్యాలీ.
Kagaznagar: ర్యావరణం బాగుంటేనే మానవ మనుగడ.. సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల
Kagaznagar: ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ ఫ్రంట్ లైన్ కార్యక్రమంలో భాగంగా కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి పట్టణంలోని ఎన్టీఆర్ చౌక్ వరకు పర్యావరణాన్ని పరిరక్షించాలంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.
ఈసందర్భంగా సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. పర్యావరణ సమతుల్యం లోపించడం వల్లనే వాతావరణంలో అసాధారణ మార్పులు చోటు చేసుకుంటున్నాయని అని అన్నారు. పర్యావరణ దినోత్సవం అంటే ఒక్కరోజుకే పరిమితం కాకూడదని అని అన్నారు. మట్టి, నీరు, గాలి, కలుషితం కాకుండా ప్రకృతి నీ పెంపొందించి కాపాడాలని అన్నారు.
Next Story




