Asifabad: డబ్బా గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అవగాహన సదస్సు!
Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో ఆర్థిక అవగాహన సదస్సు నిర్వహించారు.
Asifabad: డబ్బా గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అవగాహన సదస్సు!
Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో ఆర్థిక అవగాహన సదస్సును నిర్వహించి ఈ సదస్సులో బ్యాంకు అధికారులు గ్రామస్తులకు వివిధ పథకాల గురించి వివరించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, బ్యాంకు రుణ సదుపాయాలు, పొదుపు పథకాలు, బీమా పథకాల గురించి అవగాహన కల్పించారు.
ముఖ్యంగా రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు, స్వయం సహాయక సంఘాలకు రుణాలు, ప్రధానమంత్రి జన్ ధన్ యోజన, సురక్ష బీమా యోజన, జీవన్ జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన వంటి పథకాల ప్రయోజనాలను వివరించారు.
గ్రామస్తులు బ్యాంకింగ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని, అపోహలకు గురికాకుండా బ్యాంకు అధికారులను సంప్రదించాలని సూచించారు.
అనంతరం గ్రామస్తుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది, గ్రామ సర్పంచ్, సంతోష్ గ్రామస్తులు రైతులు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.




