Mancherial: బట్వాన్‌పల్లిలో గంజాయి సాగు.. ఇద్దరు కేటుగాళ్ల అరెస్ట్!

Mancherial: మంచిర్యాల జిల్లా బట్వాన్‌పల్లిలో గంజాయి సాగు చేస్తున్న ఇద్దరు నిందితులను తాళ్లగురిజాల పోలీసులు అరెస్ట్ చేశారు.

PRATHAP, BELLAMPALLI
Published on: 3 May 2026 4:21 PM IST
Mancherial
X

Mancherial: బట్వాన్‌పల్లిలో గంజాయి సాగు.. ఇద్దరు కేటుగాళ్ల అరెస్ట్!

Mancherial: మంచిర్యాల జిల్లా తాళ్లగురిజాల పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి ముఠా గుట్టు రట్టయింది. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు.. అక్రమంగా గంజాయి నిల్వ ఉంచుకోవడమే కాకుండా, ఇంట్లోనే గంజాయి సాగు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు. నిందితుల నుంచి భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

తాళ్లగురిజాల ఎస్‌.ఐ తెలిపిన వివరాల ప్రకారం.. బట్వాన్ పల్లి గ్రామానికి చెందిన దాగం రోహిత్ తన ఇంట్లో గంజాయి నిల్వ ఉంచుకున్నాడన్న సమాచారంతో పోలీసులు మెరుపు దాడులు చేశారు. రోహిత్ ఇంట్లో సోదాలు చేయగా భారీగా ఎండు గంజాయి లభ్యమైంది.

​అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. మహారాష్ట్ర నుంచి గంజాయిని తీసుకువచ్చి, తన స్నేహితుడు జుమ్మిడి రాజశేఖర్‌తో కలిసి చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి విక్రయిస్తున్నట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.

​రాజశేఖర్ ఇంట్లో కూడా పోలీసులు సోదాలు నిర్వహించగా.. అక్కడ కూడా ఎండు గంజాయి దొరికింది. అయితే పోలీసులకు మరింత షాక్ ఇచ్చేలా, రాజశేఖర్ ఇంటి వెనుక పెరట్లో ఏపుగా పెరుగుతున్న రెండు గంజాయి మొక్కలను పోలీసులు గుర్తించారు. బయట నుంచి కొనడం కంటే ఇక్కడే సాగు చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయనే ఉద్దేశంతో విత్తనాలు నాటి మొక్కలు పెంచుతున్నట్లు నిందితులు విచారణలో వెల్లడించారు.

PRATHAP, BELLAMPALLI

PRATHAP, BELLAMPALLI

Next Story