Mancherial: మందమర్రి తహసీల్దార్ వాహనాన్ని వెంబడించిన దుండగులు!

Mancherial: మంచిర్యాల జిల్లా మందమర్రి తహసీల్దార్ పనగంటి సతీష్ కుమార్ శర్మ వాహనాన్ని గుర్తుతెలియని వ్యక్తులు వెంబడించారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 6 Sept 2026 11:25 PM IST
Mancherial
X

Mancherial: మందమర్రి తహసీల్దార్ వాహనాన్ని వెంబడించిన దుండగులు!

మంచిర్యాల: మంచిర్యాల జిల్లా మందమర్రి తహసీల్దార్‌ను గుర్తుతెలియని వ్యక్తులు వెంబడించిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనపై తహసీల్దార్ పనగంటి సతీష్ కుమార్ శర్మ రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

శనివారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తన వాహనాన్ని వెంబడించినట్లు తహసీల్దార్ తెలిపారు. అనంతరం ఇంటి వద్దకు చేరుకున్న తర్వాత కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామున 3.30 గంటల వరకు కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరించినట్లు ఆయన పేర్కొన్నారు.

వారు దాడికి యత్నించేందుకే వచ్చారా.. లేక మరేదైనా కారణం ఉందా అన్నది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. భూ వ్యవహారాలకు సంబంధించిన వివాదమా.. వ్యక్తిగత కక్షలేమైనా ఉన్నాయా అనే కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. తహసీల్దార్‌ను గుర్తుతెలియని వ్యక్తులు వెంబడించిన ఘటన మంచిర్యాల జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.

Next Story