Medak: అనుమతి లేకుండా 14 ఈత చెట్లు కూల్చివేత.. ఎక్సైజ్ కేసు నమోదు!

Medak: మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాజీపేటలో అనుమతి లేకుండా 14 ఈత చెట్లను జేసీబీతో కూల్చివేసిన ఘటనపై నర్సాపూర్ ఎక్సైజ్ అధికారులు కేసు నమోదు చేశారు

ASHOK REDDY, NARASAPOOR
Published on: 4 July 2026 3:07 PM IST
Medak
X

Medak: అనుమతి లేకుండా 14 ఈత చెట్లు కూల్చివేత.. ఎక్సైజ్ కేసు నమోదు!

మెదక్: కౌడిపల్లి మండలం రాజీపేట గ్రామంలో అనుమతులు లేకుండా 14 ఈత చెట్లను జేసీబీతో తొలగించిన ఘటనపై ఎక్సైజ్ శాఖ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.

ఈ సందర్భంగా నర్సాపూర్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గులాం ముస్తఫా మాట్లాడుతూ, గౌడ గీత కార్మికుల జీవనాధారమైన ఈత చెట్లను అక్రమంగా కూల్చివేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

తెలంగాణ ఎక్సైజ్ చట్టం-1968 ప్రకారం అనుమతులు లేకుండా ఈత చెట్లను నరికివేసిన వారిపై కేసులు నమోదు చేస్తామని, ఎవరినీ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు

ASHOK REDDY, NARASAPOOR

ASHOK REDDY, NARASAPOOR

Next Story