Narsapur: బీవీఆర్ఐటీలో 3డీ ప్రింటింగ్‌పై ఐదు రోజుల సాంకేతిక శిక్షణ ప్రారంభం!

Narsapur: నర్సాపూర్ బీవీఆర్ఐటీలో 3డీ ప్రింటింగ్, అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్‌పై ఐదు రోజుల హ్యాండ్స్-ఆన్ శిక్షణ ప్రారంభం. హాజరైన ఐఐటీ నిపుణులు.

ASHOK REDDY, NARASAPOOR
Updated on: 15 Sept 2026 4:47 PM IST
Narsapur
X

Narsapur: బీవీఆర్ఐటీలో 3డీ ప్రింటింగ్‌పై ఐదు రోజుల సాంకేతిక శిక్షణ ప్రారంభం!

Narsapur: బీవీ రాజు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (బీవీఆర్ఐటీ)లో ఆధునిక సాంకేతికతపై విద్యార్థులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం ప్రారంభమైంది. ‘3డీ ప్రింటింగ్‌ మరియు అడిటివ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌’ అంశంపై ఐదు రోజుల హ్యాండ్స్‌-ఆన్‌ శిక్షణను మంగళవారం ప్రారంభించారు.

ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమాన్ని ఫార్మాస్యూటికల్‌ ఇంజినీరింగ్‌ విభాగం, ఏఐసీటీఈ-ఐడియా ల్యాబ్‌, డిజైన్‌ ల్యాబ్స్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.

కార్యక్రమానికి ఐఐటీ పాలక్కాడ్‌కు చెందిన డాక్టర్‌ కన్మణి సుబ్బు ఎస్. ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు 3డీ ప్రింటింగ్‌ సాంకేతికతపై అవగాహన కల్పించారు. పరిశోధన, ఆవిష్కరణలు, పరిశ్రమల్లో 3డీ ప్రింటింగ్‌ వినియోగం తదితర అంశాలను వివరించారు.

శిక్షణలో భాగంగా విద్యార్థులకు 3డీ డిజైనింగ్‌, ప్రింటింగ్‌, ప్రోటోటైప్‌ అభివృద్ధిపై ప్రత్యక్ష శిక్షణ అందిస్తున్నారు. కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా సాంకేతికతను స్వయంగా ప్రయోగించి నేర్చుకునేలా హ్యాండ్స్‌-ఆన్‌ సెషన్లు నిర్వహిస్తున్నారు.

సాంకేతిక నైపుణ్యాలతో పాటు విద్యార్థుల్లో సృజనాత్మకత, పరిశోధనా దృక్పథం, నూతన ఆవిష్కరణలపై ఆసక్తిని పెంపొందించడమే కార్యక్రమం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సంజయ్‌ దూబే, డైరెక్టర్‌ డాక్టర్‌ లక్ష్మీ ప్రసాద్‌, డీన్‌ డాక్టర్‌ వి. మురళీకృష్ణ, ఫార్మాస్యూటికల్‌ ఇంజినీరింగ్‌ విభాగాధిపతి డాక్టర్‌ పి. విష్ణు, డాక్టర్‌ ఎం. సుధీరతో పాటు పలువురు డీన్లు, విభాగాధిపతులు పాల్గొన్నారు. కార్యక్రమ ఏర్పాట్లను కళాశాల మేనేజర్‌ బి. బాపిరాజు, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ సురేష్‌ సమన్వయంతో చేపట్టారు.

ASHOK REDDY, NARASAPOOR

ASHOK REDDY, NARASAPOOR