Achampet: పాఠశాలలో ఎల్‌ఐసీ ఏజెంట్ల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం

Achampet: అచ్చంపేట పాఠశాలలో దివంగత హెచ్ఎం లక్ష్మీనారాయణ జ్ఞాపకార్థం ఎల్‌ఐసీ ఏజెంట్లు విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు, పండ్లు పంపిణీ చేశారు.

G Ashok Reddy, Narsapur
Published on: 30 Sept 2026 10:02 PM IST
Achampet
X

Achampet: పాఠశాలలో ఎల్‌ఐసీ ఏజెంట్ల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం

అచ్చంపేట: అచ్చంపేట పాఠశాల మాజీ ప్రధానోపాధ్యాయులు, దివంగత భోగా లక్ష్మీనారాయణ మృతి చెంది ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎల్‌ఐసీ ఏజెంట్ల సమూహం ఆధ్వర్యంలో అచ్చంపేట పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన సామగ్రిని పంపిణీ చేశారు.

పాఠశాలలో చదువుతున్న 83 మంది విద్యార్థులకు 83 ప్లేట్లు, 83 గ్లాసులు, బిస్కెట్ ప్యాకెట్లు, పండ్లు పంపిణీ చేశారు. ప్రస్తుత ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. దివంగత లక్ష్మీనారాయణ విద్యార్థుల పట్ల చూపిన ఆప్యాయత, విద్యాభివృద్ధికి చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ ఆయన జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమానికి దివంగత లక్ష్మీనారాయణ సతీమణి శారద హాజరై విద్యార్థులకు సామగ్రిని అందించారు. అలాగే ఎల్‌ఐసీ వికాస అధికారి లవంగ శ్రీనివాస్, ఎల్‌ఐసీ ఏజెంట్లు జక్కపల్లి శ్రీనివాస్, అందు శ్రీనివాస్, హరీష్ కుమార్, పుండ్రు కృష్ణ, చాకలి రాములు తదితరులు పాల్గొన్నారు.

పాఠశాల సిబ్బంది, విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొని దివంగత భోగా లక్ష్మీనారాయణకు నివాళులు అర్పించారు. ఆయన సేవలను స్మరించుకుంటూ విద్యార్థులకు ఉపయోగపడేలా సేవా కార్యక్రమం నిర్వహించడం పట్ల పలువురు అభినందించారు.

G Ashok Reddy, Narsapur

G Ashok Reddy, Narsapur