Narsapur: మెదక్ జిల్లాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక.. పోటెత్తిన రైతులు

Narsapur: మెదక్ జిల్లా నర్సాపూర్‌లో రైతు వారోత్సవాల సందర్భంగా ఉద్యాన మరియు ఆయిల్ పామ్ సాగుపై అవగాహన సదస్సు జరిగింది.

ASHOK REDDY, NARASAPOOR
Published on: 5 May 2026 5:38 PM IST
Narsapur
X

Narsapur: మెదక్ జిల్లాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక.. పోటెత్తిన రైతులు

నర్సాపూర్: రైతులు ఉద్యాన వనాల పట్ల ఆసక్తి చూపాలి జిల్లా అడిషనల్ కలెక్టర్ మంచు నగేష్ ప్రజా పాలనలో భాగంగా నర్సాపూర్‌లో రైతు వారోత్సవాలు: ఉద్యాన, ఆయిల్ పామ్ సాగుపై అవగాహన సదస్సు విజయవంతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "ప్రజా పాలన - 99 రోజుల ప్రగతి ప్రణాళిక"లో భాగంగా 04-05-2026 నుండి 09-05-2026 వరకు మెదక్ జిల్లా వ్యాప్తంగా "రైతు వారోత్సవాలు" నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగా రెండవ రోజు, నేడు 05-05-2026 మంగళవారం ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నర్సాపూర్‌లోని యాదవ సంఘం సంక్షేమ భవనంలో నర్సాపూర్ నియోజకవర్గ స్థాయిలో “ఉద్యాన పంటల సాగు - ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంపుదల - ప్రత్యామ్నాయ పంటల సాగు” అనే అంశంపై భారీ అవగాహన సదస్సు విజయవంతంగా నిర్వహించారు.

ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా గౌ. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మెంచు నాగేష్ గారు హాజరై రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ఉద్యాన పంటల సాగుతో రైతులు ఆర్థికంగా బలోపేతం కావాలని, ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

1. జిల్లా గ్రంథాలయ చైర్‌పర్సన్, చిలుముల సుహాసిని రెడ్డి గారు, మెదక్ జిల్లా

2. నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ లక్ష్మి రాజు యాదవ్ గారు

3. రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ నర్సాపూర్

4. వ్యవసాయ ఉపసంచాలకులు అనిత గారు

5. నర్సాపూర్ మరియు కౌడిపల్లి వ్యవసాయ ఒక సంచాలకులు

4. కృషి విజ్ఞాన కేంద్రం తునికి శాస్త్రవేత్త శ్రీనివాస్ గారు

5. లీవ్ పామ్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆయిల్ పంప్ కంపెనీ సీఈవో వీర రెడ్డి గారు

6. PACS చైర్మన్ నర్సాపూర్ అండ్ చిలిపిచాడ్

7. నర్సాపూర్ డివిజన్ వ్యవసాయ మరియు అధికారులు వ్యవసాయ విస్తరణ అధికారులు

8. ఉద్యాన అధికారులు మరియు ఉద్యాన విస్తరణ అధికారులు

9. లోపం రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆయిల్ పంప్ కంపెనీ ప్రతినిధులు

10. డ్రిప్ కంపెనీ ప్రతినిధులు

ఈ కార్యక్రమంలో ప్రముఖులు ఫాల్గొన్నారు.

సదస్సులో శాస్త్రవేత్తలు ఉద్యాన పంటల సాగు ప్రాముఖ్యత, ఆయిల్ పంప్ సాగు విస్తరణ, ఆయిల్ పామ్ సాగులో మెళకువలు, డ్రిప్ సాగు ప్రాముఖ్యత, TGMIP, MIDH, NMEO-OP పథకాల కింద రైతులకు అందుతున్న 80% నుండి 100% వరకు సబ్సిడీల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. వరికి ప్రత్యామ్నాయంగా పండ్ల తోటలు, కూరగాయల సాగు ద్వారా అధిక ఆదాయం పొందుతున్న మెదక్ జిల్లాకు చెందిన ఆదర్శ రైతులు తమ అనుభవాలను పంచుకున్నారు.

ఈ కార్యక్రమంలో నర్సాపూర్, కౌడిపల్లి, శివంపేట్, కుల్చారం మండలాల నుండి సుమారు 350 మంది రైతులు, రైతు సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఉద్యాన శాఖ ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్స్‌లో సూక్ష్మ నీటి సాగు నమూనాలు, ఆయిల్ పామ్ నారు మొక్కలు, పథకాల కరపత్రాలను రైతులు ఆసక్తిగా తిలకించారు.

ASHOK REDDY, NARASAPOOR

ASHOK REDDY, NARASAPOOR

Next Story