Narsapur: రైతులందరికీ అందుబాటులో పచ్చి రొట్టె విత్తనాలు నర్సాపూర్ వ్యవసాయ అధికారి దీపిక
Narsapur: నర్సాపూర్ మండల రైతులకు అలర్ట్: వ్యవసాయ కార్యాలయంలో జనుము, జీలుగ పచ్చిరొట్టె విత్తనాలు అందుబాటులో ఉన్నాయి.
Narsapur: రైతులందరికీ అందుబాటులో పచ్చి రొట్టె విత్తనాలు నర్సాపూర్ వ్యవసాయ అధికారి దీపిక
నర్సాపూర్: నర్సాపూర్ మండల రైతులకు ముఖ్య సమాచారం పచ్చిరొట్టె విత్తనాలు అందుబాటులో ఉన్నాయని నర్సాపూర్ మండల వ్యవసాయ అధికారి దీపికా తెలిపారు జనుము – 40 కిలోల బస్తా ధర: రూ. 3,౧౧౦ జీలుగ – 30 కిలోల బస్తా ధర: రూ. 2,452.౫౦ ఒక బస్తా 2.5 ఎకరాలకు సరిపోతుంది.
విత్తనాలు కొనుగోలు చేయదలచిన రైతులు ఆధార్ కార్డు మరియు పట్టాదారు పాస్‌బుక్తో మండల వ్యవసాయ కార్యాలయాన్ని సంప్రదించగలరు. 🧂 90% సబ్సిడీపై జిప్సం అందుబాటులో ఉంది. జిప్సం ధర: మెట్రిక్ టన్నుకు రూ. 534 ఒక ఎకరానికి ½ టన్ను జిప్సం వాడాలని సూచించబడింది.
జిప్సం కావలసిన రైతులు "HACA LTD" పేరుతో డిమాండ్ డ్రాఫ్ట్ (DD) తీసుకొని, దరఖాస్తును వ్యవసాయ శాఖ కార్యాలయంలో సమర్పించగలరు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారిణి శ్రీమతి దీపికా తెలిపారు. ఈ విషయాన్ని రైతులందరూ ఒకరినొకరు పంచుకొని పచ్చి రొట్టె విత్తనాలు తీసుకెళ్లాలని పేర్కొన్నారు.




