Andole: ఇందిరా నగర్ కాలనీవాసుల సమస్య తీర్చిన హెచ్ఎమ్టీవీ కథనం!
Andole: అందోల్-జోగిపేట ఇందిరా నగర్లోని స్మశాన వాటికలపై hmtv కథనానికి స్పందన. 2 వాటికల ఆధునీకరణకు రూ.50 లక్షల నిధుల ప్రతిపాదనలు కలెక్టర్కు పంపిన చైర్మన్.
Andole: ఇందిరా నగర్ కాలనీవాసుల సమస్య తీర్చిన హెచ్ఎమ్టీవీ కథనం!
Andole:హెచ్ఎంటివి (hmtv) కథనానికి మరోసారి గ్రౌండ్ లెవల్లో అద్భుతమైన స్పందన లభించింది. అందోల్-జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరా నగర్ కాలనీ వాసులు స్మశాన వాటికల వల్ల పడుతున్న నరకయాతనపై హెచ్ఎంటివి ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. ఈ వార్త సోషల్ మీడియాలో, స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.కాలనీ వాసుల కష్టాలపై హెచ్ఎంటివి ప్రసారం చేసిన వార్త చూసి.. మున్సిపల్ అధికారులు మరియు మున్సిపల్ చైర్మన్ తక్షణమే అలెర్ట్ అయ్యారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా.. మున్సిపల్ చైర్మన్ ప్రత్యేక చొరవ చూపారు .
చైర్మన్ గారి ఆదేశాల మేరకు ఇందిరా నగర్ కాలనీ పరిధిలోని రెండు స్మశాన వాటికల ఆధునీకరణకు మున్సిపల్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా స్మశాన వాటికల చుట్టూ 9 ఫీట్ల ఎత్తుతో పటిష్టమైన ప్రహరీ గోడ నిర్మాణం, కొత్త గేట్లు, పెయింటింగ్ పనుల కోసం మున్సిపల్ యంత్రాంగం నిధుల కసరత్తు పూర్తి చేసింది. ఒక్కో స్మశాన వాటికకు 25 లక్షల రూపాయల చొప్పున.. మొత్తం 50 లక్షల రూపాయల బడ్జెట్ ప్రపోసల్స్ అందోల్-జోగిపేట మున్సిపల్ కమిషనర్ ద్వారా సంగారెడ్డి జిల్లా కలెక్టర్కు పంపించడం జరిగింది.
ఇందిరా నగర్ కాలనీ వాసుల ఇబ్బందులను శాశ్వతంగా దూరం చేస్తామని, ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని మున్సిపల్ చైర్మన్ సోమిరెడ్డి గారి కృష్ణ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ నుండి అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ రాగానే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా టెండర్లు నిర్వహించి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయిస్తామని చైర్మన్ హామీ ఇచ్చారు. హెచ్ఎంటివి వార్తకు తక్షణమే స్పందించి, రూ. 50 లక్షల నిధుల ప్రతిపాదనలు పంపిన మున్సిపల్ చైర్మన్ కృష్ణ రెడ్డి, మున్సిపల్ అధికారుల నిర్ణయంపై ఇందిరా నగర్ కాలనీ వాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.




