Andole: అందోల్‌లో తీవ్ర ఉద్రిక్తత ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యంపై రాస్తారోకో

Andole: సంగారెడ్డి జిల్లా అందోల్‌లో ప్రయాణికులు, విద్యార్థుల భారీ రాస్తారోకో. ఆర్టీసీ బస్సులు నిలుపకపోవడంపై ఆగ్రహం. దామోదర రాజనర్సింహ జోక్యం చేసుకోవాలని డిమాండ్.

M Satya Peter, Atmakur (Karnool)
Published on: 2 Nov 2026 11:20 AM IST
Andole
X

Andole: అందోల్‌లో తీవ్ర ఉద్రిక్తత ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యంపై రాస్తారోకో

Andole: సంగారెడ్డి జిల్లాలో అందోల్ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అందోల్ బస్టాండ్ వద్ద ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యంపై ప్రయాణికులు, విద్యార్థులు,స్థానిక గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్టాండ్ ఉన్నా కూడా ఆర్టీసీ బస్సులు ఆపకుండా వెళ్తుండటంతో విసిగిపోయిన ప్రజలు. నాందేడ్-అఖోలా ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకోకు దిగారు.

ముఖ్యంగా ఉదయం పూట స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు.. సమయానికి విధులకు హాజరుకావాల్సిన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంటల తరబడి బస్సుల కోసం వేచి చూసినా, డ్రైవర్లు బస్సులను ఆపకుండా నిర్లక్ష్యంగా వెళ్ళిపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమయానికి బస్సులు లేక నిత్యం పాఠశాలలకు, కార్యాలయాలకు ఆలస్యంగా వెళ్లాల్సి వస్తోందని, దీనివల్ల తమ చదువులు, ఉద్యోగాలు దెబ్బతింటున్నాయని విద్యార్థులు, ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

"ఆర్ ఎం డౌన్ డౌన్ అధికారుల నిర్లక్ష్యం నశించాలి" అంటూ నిరసనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ రాస్తారోకో కారణంగా నాందేడ్-అఖోలా హైవేపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి, భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇప్పటికైనా స్థానిక మంత్రి దామోదర రాజనర్సింహ గారు వెంటనే స్పందించి, ఆర్టీసీ అధికారులతో మాట్లాడి ఉదయం పూట బస్సులు తప్పనిసరిగా ఆగేలా చర్యలు తీసుకోవాలని, ఈ రవాణా సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని స్థానికులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

M Satya Peter, Atmakur (Karnool)

M Satya Peter, Atmakur (Karnool)