Toopran: తూప్రాన్‌లో అర్ధరాత్రి ఏటీఎం చోరీ యత్నం విఫలం!

Toopran: మెదక్ జిల్లా తూప్రాన్‌లో అర్ధరాత్రి ఏటీఎం చోరీ యత్నం విఫలం. అప్రమత్తమైన ఎస్సై యాదగిరి నిందితుడిని అక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు.

RAJU,TOOPRAN
Published on: 22 Oct 2026 7:56 AM IST
Toopran
X

Toopran: తూప్రాన్‌లో అర్ధరాత్రి ఏటీఎం చోరీ యత్నం విఫలం!

Toopran: మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని సూర్య మెడికల్ పక్కన గల ATM లో చోరీ యత్నం విఫలమైంది.

బుధవారం అర్ధరాత్రి జరిగిన ఘటన వివరాలు:

బుధవారం అర్ధరాత్రి సమయంలో ఓ యువకుడు ATM లోకి చొరబడి షట్టర్ వేసుకుని లోపల ఉన్న ATM మిషన్ ను పగలగొట్టి డబ్బులు చోరీ చేసే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి ATM షట్టర్ మూసివేసి ఉండటం, లోపల నుండి శబ్దం రావడాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.

సమాచారం అందుకున్న వెంటనే పెట్రోలింగ్ లో ఉన్న ఎస్సై-2 యాదగిరి తన సిబ్బందితో కలిసి హుటాహుటిన ATM వద్దకు చేరుకున్నారు. లోపల శబ్దం వస్తుండటంతో లోపల ఎంతమంది ఉన్నారు, ఆయుధాలతో ఉన్నారా అని అనుమానించిన ఎస్సై, షట్టర్ ను కొద్దిగా పైకి లేపి చూడగా ఒక్కడే ఉన్నట్లు గుర్తించారు.

వెంటనే షట్టర్ పైకి ఎత్తి దొంగతనం కోసం వచ్చిన యువకుడిని ఎస్సై-2 యాదగిరి అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిందితుని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అర్ధరాత్రి అప్రమత్తంగా వ్యవహరించి దొంగను పట్టుకున్న ఎస్సై యాదగిరిని స్థానికులు అభినందిస్తున్నారు.

RAJU,TOOPRAN

RAJU,TOOPRAN