Narsapur: రాయరావు చెరువు కాలువలకు మోక్షం.. ఆవుల రాజిరెడ్డి
Narsapur: నర్సాపూర్ రాయరావు చెరువు కాలువల ఆధునికీకరణకు కాంగ్రెస్ ఇంచార్జి ఆవుల రాజిరెడ్డి హామీ ఇచ్చారు.
Narsapur: రాయరావు చెరువు కాలువలకు మోక్షం.. ఆవుల రాజిరెడ్డి
Narsapur: నర్సాపూర్ చెరువు ఆయకట్టు ద్వారా పంట పొలాలకి వెళ్లే కాలువలను ఆధునికరిస్తాము. కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గం ఇంచార్జి ఆవుల రాజిరెడ్డి నర్సాపూర్ రాయరావు చెరువు నుంచి పంట పొలాలకు వెళ్లే నీటి ప్రవాహంలో కొన్నిచోట్ల సరైన కల్వట్లు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి రాయరావు చెరువు నుండి పంట పొలాలకి వెళ్లే నీటి కాలువలను పరిశీలించారు.
ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో మాట్లాడిన ఆయన, సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు.రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నీటి సరఫరా సక్రమంగా జరిగేలా కల్వట్ల నిర్మాణ పనులను వీలైనంత త్వరగా ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం నర్సాపూర్ పట్టణంలో నూతనంగా ఎంపికైన 70 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి మరియు ఆవుల రాజిరెడ్డి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




