Dubbaka: ఎస్సీ, ఎస్టీలపై వివక్ష లేకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలి!

Dubbaka: ఎస్సీ, ఎస్టీల పౌరహక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేసిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య.

KARUNAKAR,	DUBBAK
Published on: 29 Aug 2026 3:08 PM IST
Dubbaka
X

Dubbaka: ఎస్సీ, ఎస్టీలపై వివక్ష లేకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలి!

Dubbaka: ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టపరమైన రక్షణలు మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడంతో పాటు, వారి పౌరహక్కులకు భంగం కలగకుండా అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ గౌరవ శ్రీ బక్కి వెంకటయ్య గారు అన్నారు.

ఈ సందర్భంగా చైర్మన్ శ్రీ బక్కి వెంకటయ్య గారు మాట్లాడుతూ,భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిందని, ఎస్సీ, ఎస్టీలపై ఎలాంటి వివక్ష, సామాజిక అణచివేత, దాడులు, వేధింపులు చోటుచేసుకోకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.

ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణ కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరూ సమానత్వం, సోదరభావం, సామాజిక న్యాయం అనే విలువలను పాటించాలని పిలుపునిచ్చారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK

Next Story