Pocharam: పోచారం తండాలో ఉచిత వైద్య శిబిరం

Pocharam: కామారెడ్డి జిల్లా పెద్దకొడప్‌గల్ మండలం పోచారం తండాలో జూలై 12న బాన్సువాడ సెవెన్ హిల్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరగనుంది.

VEERANNA, JUKKAL
Published on: 11 July 2026 1:19 PM IST
Pocharam
X

Pocharam: పోచారం తండాలో ఉచిత వైద్య శిబిరం

Pocharam: బిచ్కుంద (కామారెడ్డి) బాన్సువాడ సేవన్ హిల్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఈ నేల 12 న పెద్ద కొడప్ గల్ మండలం పోచారం తండా లో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్. సామినేని వాగ్దేవి తెలిపారు.

శిబిరం సందర్భంగా రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు, మధు మొహం, జనరల్ మెడిషన్ మహిళలు, వృద్ధులకు సంబంధించిన సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతోపాటు అవసరమైన వారికి ఉచిత వైద్య సలహాలు, మందులను అందజేయనున్నట్లు ఆస్పత్రి నిర్వాహకులు తెలిపారు.

తండాలో నిర్వహించే ఈ శిబిరంలో ప్రముఖ వైద్యులు పాల్గొని ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నారు. గ్రామీణ ప్రాంతా ప్రజలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.వైద్య శిబిరం లో డాక్టర్.దివ్య భవానీ స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్. విశాల్ సింగ్ అనేస్తే షియా లచే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని ఆస్పత్రి వైద్య సిబ్బంది తెలిపారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story