Baswapur: బస్వాపురం ముంపు బాధితుల హర్షం సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం!

Baswapur: బస్వాపురం రిజర్వాయర్ ఆర్‌ అండ్ ఆర్‌ భూసేకరణకు రూ.206 కోట్ల నిధులు విడుదల చేయడంతో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బి.ఎన్. తిమ్మాపురం గ్రామస్తులు.

T RAMREDDY, BHONAGIRI
Published on: 19 Aug 2026 5:14 PM IST
Baswapur
X

Baswapur: బస్వాపురం ముంపు బాధితుల హర్షం సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం!

Baswapur: బస్వాపురం రిజర్వాయర్ ముంపు గ్రామమైన బి.ఎన్. తిమ్మాపురం గ్రామస్తులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.రిజర్వాయర్‌ కోసం చేపట్టిన ఆర్‌ & ఆర్‌ భూసేకరణకు రూ.206 కోట్ల నిధులు విడుదల కావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

బస్వాపురం రిజర్వాయర్‌ నిర్మాణంలో భాగంగా బి.ఎన్. తిమ్మాపురం ,యాదగిరిగుట్ట మండలంలోని లప్పనాయక్ తండా,తుర్కపల్లి మండలంలోని చౌక్ల తండా ముంపు గ్రామలకు ఎన్నాళ్లుగానో పెండింగ్‌లో ఉన్న ఆర్‌ & ఆర్‌ భూసేకరణ ప్రక్రియకు తాజాగా రూ.206 కోట్ల నిధులు విడుదల కావడంతో బి ఎన్ తిమ్మాపురం గ్రామస్తులు ఆనందం నెలకొంది.

ఈ సందర్భంగా గ్రామస్తులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతలు తెలిపారు.నిధుల విడుదలతో తమ పునరావాసం, పరిహారం ప్రక్రియ ముందుకు సాగుతుందన్న ఆశాభావాన్ని గ్రామస్తులు వ్యక్తం చేశారు.

గ్రామస్తుల మాటల్లో:

“ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఆర్‌ & ఆర్‌ ప్రక్రియకు నిధులు విడుదల కావడం సంతోషంగా ఉంది. ప్రభుత్వం త్వరగా మిగిలిన ప్రక్రియను పూర్తి చేసి, అర్హులైన నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతున్నాం.రూ.206 కోట్ల నిధుల విడుదలతో బి.ఎన్. తిమ్మాపురం నిర్వాసితుల్లో కొత్త ఆశలు చిగురించాయి. ప్రభుత్వం ఆర్‌ & ఆర్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు

T RAMREDDY, BHONAGIRI

T RAMREDDY, BHONAGIRI