Patancheru: హరీష్ రావుకు దసరా శుభాకాంక్షలు తెలిపిన పటాన్‌చెరు బీఆర్ఎస్ నేతలు!

Patancheru: మాజీ మంత్రి హరీష్ రావుకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపిన ఇంద్రేశం, ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్లు, బీఆర్ఎస్ నాయకులు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 24 Oct 2026 12:43 PM IST
Patancheru
X

Patancheru: హరీష్ రావుకు దసరా శుభాకాంక్షలు తెలిపిన పటాన్‌చెరు బీఆర్ఎస్ నేతలు!

Patancheru: దసరా పండుగ సందర్భంగా.. మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావుకి.. పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి ఇస్నాపూర్, ఇంద్రేశం మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దసరా పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. రెండు మున్సిపాలిటీల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను వివరించారు. ప్రజలు నమ్మకంతో బిఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారని ఇందుకు అనుగుణంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్లు సుమలత శ్రీకాంత్, ప్రమీల, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు,అంతిరెడ్డి, నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్