Narsapur: నర్సాపూర్‌లో హరీష్ రావు బర్త్‌డే వేడుకలు
Narsapur: నర్సాపూర్‌లో ఘనంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు టి. హరీష్ రావు జన్మదిన వేడుకలు.
Narsapur: నర్సాపూర్‌లో హరీష్ రావు బర్త్‌డే వేడుకలు
నర్సాపూర్: పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు T. Harish Rao జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నర్సాపూర్ మున్సిపల్ 10వ వార్డు కౌన్సిలర్ బుల్లెట్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హరీష్ రావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా కూడలి వద్ద కేక్ కట్ చేసి ప్రజలకు, కార్యకర్తలకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ హరీష్ రావు తెలంగాణ ప్రజల అభివృద్ధే ధ్యేయంగా నిరంతరం ప్రజాసేవ చేస్తున్నారని కొనియాడారు. ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి, తెలంగాణ ప్రజలకు మరిన్ని సేవలు అందించే అవకాశం కల్పించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో 10వ వార్డు ఇంచార్జ్ నాగరాజు గౌడ్, రింగుల ప్రసాద్‌తో పాటు నర్సాపూర్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




