Narsapur: నర్సాపూర్ మున్సిపాలిటీకి కొత్త నిధులేవి? బీఆర్ఎస్ నిలదీత!

Narsapur: మంత్రి వివేక్ వెంకటస్వామి నర్సాపూర్ పర్యటన ఏర్పాట్లకు మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి రూ. 25 లక్షలు కేటాయించడంపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ASHOK REDDY, NARASAPOOR
Published on: 11 Aug 2026 4:34 PM IST
Narsapur
X

Narsapur: నర్సాపూర్ మున్సిపాలిటీకి కొత్త నిధులేవి? బీఆర్ఎస్ నిలదీత!

Narsapur: మంత్రి వివేక్ వెంకటస్వామి నర్సాపూర్ పర్యటన సందర్భంగా నూతన మున్సిపల్ భవన ప్రారంభోత్సవానికి మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి రూ.25 లక్షలు కేటాయించడంపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజల అభివృద్ధి కోసం వినియోగించాల్సిన మున్సిపల్ నిధులను మంత్రి పర్యటన ఏర్పాట్ల కోసం ఖర్చు చేయడం ఏమిటని ప్రశ్నించారు.

నర్సాపూర్ పట్టణంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు బుల్లెట్ రాజు, మోహిజ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బిక్షపతి, సీనియర్ నాయకుడు బాల్ రెడ్డి సత్యం గౌడ్, , రింగుల ప్రసాద్ జ్ఞానేశ్వర్, మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ భవన ప్రారంభోత్సవానికి మంత్రి హాజరవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధులు కేటాయించాల్సింది పోయి, మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి రూ.25 లక్షలు తీసుకోవడం సరికాదన్నారు.

మంత్రి వస్తున్నారు.. నిధులు ఎందుకు ఇవ్వరు?

మున్సిపల్ ఎన్నికల సమయంలో మంత్రి వివేక్ వెంకటస్వామి నర్సాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.30 కోట్ల నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీ ఏమైందని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించారు. మంత్రి నర్సాపూర్ పర్యటన సందర్భంగా పట్టణ అభివృద్ధికి కనీసం రూ.50 లక్షల నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

నర్సాపూర్ పట్టణంలో చాలాకాలంగా అసంపూర్తిగా ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్, దోబీఘాట్ తదితర అభివృద్ధి పనులకు వెంటనే నిధులు మంజూరు చేసి పూర్తి చేయాలని కోరారు. ప్రజలకు అవసరమైన పనులకు నిధులు కేటాయించకుండా, ప్రారంభోత్సవ ఏర్పాట్ల కోసం జనరల్ ఫండ్ నుంచి రూ.25 లక్షలు ఖర్చు చేయడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.

కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికపై ప్రశ్నలు

తెలంగాణ రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల్లో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికలు పూర్తయినప్పటికీ, నర్సాపూర్ మున్సిపాలిటీలో మాత్రం ఇప్పటివరకు ఎన్నికలు పూర్తి కాలేదని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. నర్సాపూర్ మున్సిపాలిటీ విషయంలో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

మంత్రి వచ్చి నర్సాపూర్ మున్సిపల్ కి నిధులు ఇవ్వాలి కానీ ఉన్న నిధుల లో మంత్రి రాక ఖర్చు చేయడం ఏంటి అని brs నాయకులు మండిపడుతున్నారు, మంత్రి పెద్ద మొత్తం లో నర్సాపూర్ మున్సిపాలిటీకి నిధులు మంజూరు చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు.

మున్సిపల్ జనరల్ ఫండ్ ప్రజల అవసరాలు, పట్టణ అభివృద్ధి పనుల కోసం వినియోగించాలని, కార్యక్రమాల పేరుతో నిధులను ఖర్చు చేయడం సరికాదని బీఆర్ఎస్ కౌన్సిలర్లు స్పష్టం చేశారు.ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, నాయకులు విటల్, ఆంజనేయులు గౌడ్, ఆనంద్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

ASHOK REDDY, NARASAPOOR

ASHOK REDDY, NARASAPOOR

Next Story