Gajwel: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలి!

Gajwel: సిద్దిపేట జిల్లా గజ్వేల్ కలెక్టరేట్ కాంప్లెక్స్ ఎదుట బీఆర్‌ఎస్ ధర్నా. వంటేరు ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కొనసాగించాలని నిరసన.

MEER OSMAN ALI KHAN, GAJEWL
Published on: 18 Aug 2026 2:35 PM IST
Gajwel
X

Gajwel: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలి!

Gajwel: గజ్వేల్ సిద్దిపేట జిల్లా కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గజ్వేల్ పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ ఎదుట బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన,ధర్నా కార్యక్రమం నిర్వహించారు. గజ్వేల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలిచే కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రభుత్వం కొనసాగించాలని డిమాండ్ చేశారు. వివాహ సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే కుటుంబాలకు ఈ పథకాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని పేర్కొన్నారు.

పథకాల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుని అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించాలని కోరారు.ప్రభుత్వం వెంటనే స్పందించి కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలును కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

MEER OSMAN ALI KHAN, GAJEWL

MEER OSMAN ALI KHAN, GAJEWL

Next Story