Narsapur: జాతీయ స్థాయిలో బీవీఆర్ఐటీ విద్యార్థుల సరికొత్త రికార్డు!
Narsapur: మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని బీవీఆర్ఐటీ (BVRIT) కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో సరికొత్త రికార్డు సృష్టించారు.
Narsapur: జాతీయ స్థాయిలో బీవీఆర్ఐటీ విద్యార్థుల సరికొత్త రికార్డు!
Narsapur: బి. వి. రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు బెంగుళూరు లో నిర్వహించబడిన జాతీయ స్థాయి సాంకేతిక పోటీలలో మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు. ప్రముఖ సెమీకండక్టర్ సంస్థ ఆర్మ్ హోల్డింగ్స్ (Arm Holdings) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించిన “ఆర్మ్ భారత్ ఏఐ చాలెంజ్” పోటీలలో సమస్యా విభాగం–5వ కేటగిరీలో కళాశాలకు చెందిన “అడ్ ఆస్ట్రా” జట్టు విజేతలుగా నిలిచి ప్రథమ బహుమతిని కైవసం చేసుకుంది.
ఈ ప్రాజెక్ట్కు కళాశాల అధ్యాపకులు డా. యు. జ్ఞానేశ్వర చారి మార్గదర్శకత్వం వహించారు. ఆయన పర్యవేక్షణలో బీవీఆర్ఐటీకి చెందిన మూడవ సంవత్సరం ఈసీఈ విద్యార్థులు చేరాల రోహన్ కుమార్ మరియు కార్తీక్ పాకాల అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వినూత్న ప్రాజెక్ట్ను రూపొందించారు.
“రియల్ టైమ్ ఆబ్జెక్ట్ డిటెక్షన్ యూజింగ్ హార్డ్వేర్ యాక్సిలరేటెడ్ సి.ఎన్.ఎన్ ఆన్ జైలింక్స్ జింక్ ఎఫ్పీజీఏ విత్ ఆర్మ్ ప్రాసెసర్” అనే అంశంపై రూపొందించిన ఈ ప్రాజెక్ట్ జాతీయ స్థాయిలో విశేష ప్రశంసలు అందుకుంది. జైలింక్స్ (Xilinx) జింక్ ఎఫ్పీజీఏ మరియు ఆర్మ్ ప్రాసెసర్ల సహాయంతో రియల్టైమ్ ఆబ్జెక్ట్ డిటెక్షన్ను వేగవంతంగా మరియు సమర్థవంతంగా నిర్వహించే విధానాన్ని విద్యార్థులు అభివృద్ధి చేశారు. ఎడ్జ్ ఏఐ మరియు ఎంబెడెడ్ సిస్టమ్స్ రంగాల్లో ఈ ప్రాజెక్ట్ ఒక వినూత్న సాంకేతిక పరిష్కారంగా నిలిచిందని నిపుణులు అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం, శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ ఛైర్మన్ శ్రీ కె.వి.విష్ణురాజు, వైస్ ఛైర్మన్ శ్రీ రవిచంద్రన్ రాజగోపాల్, కార్యదర్శి శ్రీ ఆదిత్య విస్సం గారు విద్యార్థులను అభినందించారు. ఛైర్మన్ శ్రీ కె.వి.విష్ణురాజు గారు మాట్లాదుతూ విద్యార్థులకు అందిస్తున్న మంచి లాబ్స్ సౌకర్యాలు ఉండటం వలన ఇటువంటి ప్రతిభ విద్యార్థులనుండి దేశవ్యాప్తంగా విస్తరంచబడుతుందని తెలిపారు. వారు విద్యార్థులను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగాన్ని అభినదించారు
కళాశాల ప్రిన్సిపాల్ డా. సంజయ్ దూబే, కళాశాల డైరెక్టర్ డా. లక్ష్మీ ప్రసాద్ మరియు ఈసీఈ విభాగాధిపతి డా. సంజీవ్ రెడ్డి, కళాశాల మేనేజర్ శ్రీ బి.బాపిరాజు గారు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ TLN సురేష్ గారు విద్యార్థులను అభినందించారు. జాతీయ స్థాయిలో కళాశాల ప్రతిష్టను మరింతగా పెంచిన ఈ విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో కూడా విద్యార్థులు పరిశోధన మరియు ఆవిష్కరణల దిశగా మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
విద్యార్థుల ఈ విశిష్ట విజయం బి. వి. రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలకు మరో గౌరవాన్ని తీసుకువచ్చారని ప్రిన్సిపాల్ సంజయ్ దూబే అన్నారు. లక్ష రూపాయల నగదు తో పాటు ప్రశంసా పత్రాన్ని ప్రిన్సిపల్ చేతుల మీదుగా అందించారు.




