Medak: మెదక్ కేర్ హాస్పిటల్ సీజ్.. శిశువు విక్రయం బట్టబయలు!
Medak: మెదక్ జిల్లా కేంద్రంలోని కేర్ హాస్పిటల్లో ఘోరం చోటుచేసుకుంది.
Medak: మెదక్ కేర్ హాస్పిటల్ సీజ్.. శిశువు విక్రయం బట్టబయలు!
మెదక్: పుట్టినరోజు శిశువు చనిపోయిందని తల్లిదండ్రులకు చెప్పి హస్పటల్ సిబ్బంది ఇతరులకు అమ్మి సొమ్ము చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది వివరాలకు వెళితే . నస్రా ఫాతిమా, భర్త: అస్లాం ఖాన్, వయస్సు సుమారు 28 సంవత్సరాలు, కులం: ముస్లిం, వృత్తి: గృహిణి, స్వస్థలం: మౌలాలి, సికింద్రాబాద్, ప్రస్తుతం నివాసం: లక్ష్మీనగర్ తండా, అనే వ్యక్తి నేను పనిచేసే కేర్ హాస్పిటల్ లో డెలివరీ కోసం 12.04.2026 నాడు అడ్మిట్ అయినది. అదే రోజు రాత్రి ఆమెకు బ్లడ్ తక్కువగా ఉన్నందున బ్లడ్ ఎక్కించడం జరిగినది.
తరువాత 13.04.2026 నాడు ఉదయం 11.00 గంటల నుండి 12.00 గంటల వరకు ఆమె కు డెలివరీ సర్జరీ చేయగా ఆమెకు 2.4 కేజి ల బరువు కలిగిన బేబీ గర్ల్ జన్మించింది, అట్టి సమయం లో అక్కడ నర్స్ గా పనిచేసే అక్తరి బేగం బేబీ గర్ల్ పిడియట్రిషన్ వద్దకు తీసుకెళ్తున్నాము అని చెప్పి ముందుగా ప్లాన్ చేసుకున్న విదంగా తనకు తెలిసిన వ్యక్తి అయిన నౌసిన్ ఉన్నిసా @ నిలోఫర్ గోల్కొండ స్ట్రీట్ అనే వ్యక్తి ని పిలిచి అట్టి బేబీ గర్ల్ ను ఇచ్చి, ఇద్దరు కలిసి 1,50,000 రూపాయలకు సిద్దిపేట కు చెందిన మహమ్మద్ ఇక్బాల్ ఉద్దీన్.
శదీయ సుల్తానా దంపతులకు అమ్మి అందులో 1,40,000 రూపాయలను అకరి బేగుం తీసుకుంది, 10,000 రూపాయలను నౌసిన్ ఉన్నిసా @ నిలోఫర్. ఇందులో హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని పిర్యాదు రాగా 03.05.2026 నాడు కేసు నమోదు చేసి విచారణ జరిపి అక్తరి బేగం నౌసిన్ ఉన్నిసా @ నిలోఫర్, మహమ్మద్ ఇక్బాల్ ఉద్దీన్, శదీయ సుల్తానా లను Cr. No 212/26 U/S 143 (4),137(2) BNS and 81 JJ ACT అరెస్ట్ చేసు రిమాండ్ కు తరలించటం జరిగిందిని పట్టణ సీఐ మహేష్ తెలిపారు పాపను తల్లిదండ్రులకు అప్పజెప్పడం జరిగిందని పట్టిన సీఐ తెలిపారు.




