Narsapur: నర్సాపూర్‌లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ పనులు

Narsapur: 2, 4, 14వ వార్డుల్లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ యాదవ్, వైస్ చైర్మన్ బుచ్చేష్ యాదవ్ శ్రీకారం.

ASHOK REDDY, NARASAPOOR
Published on: 1 Jun 2026 4:04 PM IST
Narsapur
X

Narsapur: నర్సాపూర్‌లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ పనులు

నర్సాపూర్: పట్టణంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్, సీసీ రోడ్ల పనులను ప్రారంభించిన నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ యాదవ్ మరియు వైస్ చైర్మన్ బుచ్చేష్ యాదవ్ నర్సాపూర్ పట్టణంలోని 2వ, 4వ మరియు 14వ వార్డుల్లో నగర అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ మరియు సీసీ రోడ్ల నిర్మాణ పనులను ఈరోజు ఘనంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ మురళీధర్ యాదవ్ , మున్సిపల్ చైర్మన్ శ్రీ లక్ష్మీరాజు యాదవ్ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ బుచ్చెష్ యాదవ్ , మున్సిపల్ కమిషనర్ శ్రీ సాయికుమార్ పాల్గొన్నారు. అదేవిధంగా కౌన్సిలర్లు శ్రీకాంత్, నిరంజన్ , సునీత బాల్ రెడ్డి గారు, పంబల లలితా బిక్షపతి , అంతారం సుధీర్ , బుల్లెట్ రాజు,మాజీ కౌన్సిలర్ ఎరుకల యాదగిరి, ఫారెస్ట్ బిక్షపతి, శ్రీనివాస్, వార్డు ప్రజలు మరియు ఇతర ప్రముఖులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి మున్సిపాలిటీ కట్టుబడి ఉందని, చేపడుతున్న అభివృద్ధి పనులు ప్రజలకు మెరుగైన సౌకర్యాలను అందిస్తామని అన్నారు.

ASHOK REDDY, NARASAPOOR

ASHOK REDDY, NARASAPOOR

Next Story