Chegunta: చేగుంట మండలంలో వాలంటరీ టీచర్ అదృశ్యం పోలీసులకు ఫిర్యాదు
Chegunta: మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజిపేటలో వాలంటరీ టీచర్‌గా పనిచేస్తున్న వరలక్ష్మి అదృశ్యం. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ.
Chegunta: చేగుంట మండలంలో వాలంటరీ టీచర్ అదృశ్యం పోలీసులకు ఫిర్యాదు
చేగుంట: మెదక్ జిల్లా, చేగుంట మండలం, మక్కరాజిపేట గ్రామానికి చెందిన బోయిని సుగుణ (44) తన కుమార్తె బోయిని వరలక్ష్మి (22) కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వరలక్ష్మి మక్కరాజిపేట ప్రాథమిక పాఠశాలలో వాలంటరీ టీచర్‌గా పనిచేస్తోంది. 03.11.2026న ఇంట్లో ఉన్న ఆమె, సాయంత్రం సమయంలో కనిపించకుండా పోయింది.
అదే గ్రామానికి చెందిన బంధువు బెస్త సత్యలక్ష్మిని అడుగగా, బట్టలు కుట్టించుకోవడానికి టైలర్ షాపుకు వెళ్తున్నట్లు చెప్పి బ్యాగుతో బయటకు వెళ్లినట్లు తెలిసింది.
కుటుంబ సభ్యులు బంధువులు, పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. ఆమె సెల్‌ఫోన్ కూడా స్విచ్ ఆఫ్‌లో ఉంది.
తల్లి ఫిర్యాదు మేరకు చేగుంట SI చైతన్య కుమార్ రెడ్డి దర్యాప్తు చేస్తున్నారు.




