Siddipet: బాల్యవివాహం చేయొద్దు పిల్లల భవిష్యత్తును తుంచొద్దు తొగుట ఎస్సై
Siddipet: సిద్దిపేట జిల్లా తొగుట కేజీబీవీలో బాల్య వివాహాల నిరోధక అవగాహన సదస్సు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని ఎస్సై నవీన్ హెచ్చరిక.
Siddipet: బాల్యవివాహం చేయొద్దు పిల్లల భవిష్యత్తును తుంచొద్దు తొగుట ఎస్సై
Siddipet: సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని కేజీబీవీ లో కలెక్టర్ మరియు DCPO ఆదేశాల మేరకు ఆశ్రిత స్వచ్ఛంద సంస్థ ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమానికిముఖ్య అతిథిగా పాల్గొన్న తొగుట ఎస్సై నవీన్ మాట్లాడుతూ బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం.
బాల్య వివాహాలు చేసినా, సహకరించినా, చేసుకున్న వారికి బాల్య వివాహాల నిరోధక చట్టం 2006 ప్రకారం శిక్షార్హులు అవుతారని బాలల బంగారు భవిష్యత్తును చిదిమేసి చిన్నతనంలోనే పెళ్లి చేయడం వల్ల అనేక సమస్యలు వస్తాయని అన్నారు.
బాలబాలికలు బాగా కష్టపడి చదువుకోవాలని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జీవితంలో సెట్ అయ్యాకే పెళ్లి చేసుకోవాలనే సంకల్పంతో చదువును సాగించాలని అనవసరపు విషయాల పట్ల ఆకర్షితులు కాకుండా చదువు పైనే దృష్టి కేంద్రీకరించాలని తెలిపారు
నేటి పరిస్థితులలో బాల బాలికలు సోషల్ మీడియా, ఇంస్టాగ్రామ్ , ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి మాధ్యమాల ద్వారా ఇబ్బందులు తెచ్చుకుంటున్నారని వీలైనంతవరకు వాటికి దూరంగా ఉండాలని అన్నారు.




