Narsapur: నర్సాపూర్ ఆశ్రమాల్లో రాష్ట్ర కమిషన్ తనిఖీలు
Narsapur: నర్సాపూర్ పట్టణంలో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ సీతా దయాకర్ రెడ్డి పర్యటన.
Narsapur: నర్సాపూర్ ఆశ్రమాల్లో రాష్ట్ర కమిషన్ తనిఖీలు
Narsapur: నర్సాపూర్ పట్టణం లోని బాలల సంరక్షణ కేంద్రాల పనితీరు మరింత మెరుగుపడే దిశగా చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్‌పర్సన్ సీతా దయాకర్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం నరసాపూర్ పట్టణంలో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ సీతా దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సభ్యులు కంచర్ల వందన గౌడ్, మర్రిపల్లి చందన, ఆపర్ణ, బి. వచన్ కుమార్ కమిషన్ సభ్యులు విస్తృతంగా పర్యటించారు.
నర్సాపూర్ పర్యటనకు విచ్చేసిన బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీతారెడ్డికి మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ స్వాగతం పలికారు. ముందుగా నరసాపూర్ పట్టణంలో వికాసం వికలాంగుల పునరావాస కేంద్రం సందర్శించి బాల బాలికల సంరక్షణ కోసం అధికారులు తీసుకుంటున్న చర్యలపై అడిగి తెలుసుకున్నారు. శారీరక వైకల్యం కలిగిన వికలాంగ చిన్నారిని చూసి చే లించిన హృదయంతో ఆ చిన్నారికి ఆపరేషన్ ద్వారా వైకల్యాన్ని సరిచేసి పౌష్టికాహారం అందించి విద్యాబుద్ధుల నేర్పించి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా చెప్పారు. అనంతరం భవిత కేంద్రాన్ని సందర్శించి చిన్నారులతో ముచ్చటించారు. భవిత కేంద్రాలు ఆదర్శవంతంగా పనిచేస్తున్నాయని చిన్నారులకు ఆటపాటలతో కూడిన నైపుణ్యాలు నేర్పుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. శివం పేట బేతని సంరక్షణ ఆశ్రమం పరిశీలించారు.
ఈ సందర్భంగా బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్‌పర్సన్ సీతా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాలల హక్కుల పరిరక్షణ పై ప్రత్యేక దృష్టి సారిస్తుందని కమిషన్ సభ్యులు జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తూ బాలల హక్కుల ఉల్లంఘనలు, పౌష్టికాహార లోపం, మరియు రాష్ట్రంలో బాలల హక్కుల పరిరక్షణ, మెరుగైన విద్య, ఆరోగ్యం, మరియు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం పిల్లలపై దాడులను అరికట్టడానికి కమిషన్ కట్టుబడి ఉందని, ప్రతి 6 నెలలకు లేదా ఏడాదికి ఒకసారి సంరక్షణ కేంద్రాల పనితీరును సమీక్షిస్తామని కమిషన్ స్పష్టం చేసింది.
ఈ కార్యక్రమంలో మహిళా శ్రీ శిశు సంక్షేమ అధికారి హేమ భార్గవి, రామాయంపేట సిడిపిఓ స్వరూప, డిసిపిఓ నాగరాజు,జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




