Patancheru: పెద్ద కంజర్లలో 'చిత్రధార' చిత్రలేఖన శిక్షణ ప్రారంభం!
Patancheru: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పెద్ద కంజర్ల గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాలలో 'చిత్రధార' పేరుతో నాలుగు రోజుల ప్రత్యేక గిరిజన చిత్రలేఖన శిక్షణ ప్రారంభమైంది.
Patancheru: పెద్ద కంజర్లలో 'చిత్రధార' చిత్రలేఖన శిక్షణ ప్రారంభం!
Patancheru: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండల పరిధిలోని పెద్ద కంజర్ల తెలంగాణ గిరిజన సంక్షేమ డిగ్రీ (బాయ్స్) కళాశాలలో ఏడు గిరిజన డిగ్రీ కళాశాల మరియు ఒక law గిరిజన కళాశాల విద్యార్థులకు ‘చిత్రధార’ పేరుతో నాలుగు రోజుల ప్రత్యేక గిరిజన చిత్రలేఖన (పెయింటింగ్) శిక్షణా కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి గిరిజన సంక్షేమ గురుకుల కార్యదర్శి (Secretary) కె. సీతా లక్ష్మి, IAS ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (TCRTI) కి చెందిన ప్రముఖ చిత్రలేఖన నిపుణులు విద్యార్థులకు ప్రత్యక్షంగా (ప్రాక్టికల్‌గా) శిక్షణ ఇస్తున్నారు.
ఈ నాలుగు రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజూ ఒక్కో గిరిజన తెగ సంస్కృతి, కళలకు సంబంధించిన చిత్రలేఖనాన్ని నేర్పించనున్నారు.
ముఖ్యంగా నాయకపోడు, కోయ, గోండు మరియు లంబాడీ తెగల సాంప్రదాయ ఆర్ట్ శైలులపై విద్యార్థులకు నిపుణులు కూలంకషంగా అవగాహన కల్పిస్తూ, స్వయంగా చిత్రీకరించేలా ప్రాక్టికల్ శిక్షణ అందిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ గురుకుల జాయింట్ సెక్రటరీ (JS) డి.ఎస్. వెంకన్న, డిగ్రీ కాలేజెస్ డిప్యూటీ సెక్రటరీ వేణుగోపాల్, అకాడమిక్స్ డిప్యూటీ సెక్రటరీ జి.బి. వెంకటేష్, OSD,(డిగ్రీ కళాశాల) నీరజ మరియు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సునీల గారు, కళాశాల అధ్యాపక బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.




