Medak: అక్టోబర్ 26న మున్సిపల్ కార్మికుల ‘చలో హైదరాబాద్’!

Medak: మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 26న ‘చలో హైదరాబాద్’ పిలుపు. మెదక్ మున్సిపల్ అధికారులకు వినతి పత్రం సమర్పించిన సీఐటీయూ నాయకులు.

NAGARAJ, MEDAK
Published on: 23 Oct 2026 3:05 PM IST
Medak
X

Medak: అక్టోబర్ 26న మున్సిపల్ కార్మికుల ‘చలో హైదరాబాద్’!

మెదక్: కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపల్ సిబ్బందిని పర్మినెంట్ చేయడంతో పాటు కనీస వేతనం రూ.30 వేలకు పెంచాలని, రెండో పీఆర్సీని ప్రకటించి డీఏ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఈ నెల 26న ‘చలో హైదరాబాద్‌’కు పిలుపునిచ్చింది.

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మెదక్ మున్సిపల్ కమిటీ అధికారులకు, వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి మల్లేశం మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లు, ఇతర మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో సుమారు 60 వేల మంది ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తున్నారని వారు ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్నప్పటికీ చాలామందికి ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, అర్హతకు తగిన పదోన్నతులు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

పారిశుధ్య పనుల్లో రక్షణ పరికరాలు, సరైన వైద్య సదుపాయాలు లేక కార్మికులు అనారోగ్యానికి గురవుతున్నారని, ప్రమాదాల్లో మరణించిన వారికి తగిన పరిహారం అందడం లేదని ఆయన తెలిపారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో మున్సిపల్ పారిశుధ్య కార్మికుల వేతనాలు పెంచి పర్మినెంట్ చేస్తామని, ప్రతి నియోజకవర్గంలో కార్మికుల కాలనీలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిందని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా హామీలు అమలు కాలేదని ఆయన విమర్శించారు.

మున్సిపల్ సిబ్బందిని పర్మినెంట్ చేయడం, రెండో పీఆర్సీని ప్రకటించడం, కనీస వేతనాన్ని రూ.30,000గా నిర్ణయించడం, డీఏ వర్తింపజేయడం, జీవో నంబర్ 1181ను రద్దు చేయడం వంటి డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని. వయోభారం, అనారోగ్యం, ప్రమాదాలు లేదా మరణాల కారణంగా విధులకు దూరమైన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించాలని, పట్టణాల విస్తరణకు అనుగుణంగా కొత్త సిబ్బందిని నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి అక్టోబర్ 26న నిర్వహించనున్న రాష్ట్రవ్యాప్త ‘చలో హైదరాబాద్‌’ విజయవంతం చేయాలని అయిన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ కార్మికుల పెద్ద ఎత్తున పాల్గొంటారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ మెదక్ జిల్లా కార్యదర్శి నాగరాజు. ఏసు రోజా.మహేష్. బాల ఎల్లం.లక్ష్మి. తదితరులు పాల్గొన్నారు.

NAGARAJ, MEDAK

NAGARAJ, MEDAK