Narsapur: పేదల వైద్యానికి అండగా ముఖ్యమంత్రి సహాయనిధి: ఆవుల రాజిరెడ్డి!

Narsapur: నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి 262 మంది లబ్ధిదారులకు రూ.87 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.

ASHOK REDDY, NARASAPOOR
Published on: 23 Nov 2026 8:59 PM IST
Narsapur
X

Narsapur: పేదల వైద్యానికి అండగా ముఖ్యమంత్రి సహాయనిధి: ఆవుల రాజిరెడ్డి!

నర్సాపూర్: పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య చికిత్స సమయంలో ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి సహాయనిధి పనిచేస్తోందని నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి అన్నారు.

నర్సాపూర్ పట్టణంలోని శ్రీ సాయికృష్ణ గార్డెన్స్‌లో నిర్వహించిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని 262 మంది లబ్ధిదారులకు రూ.87 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ.. అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేని పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో అండగా నిలుస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

2024 నుంచి 2026 వరకు నర్సాపూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 2,113 మంది లబ్ధిదారులకు రూ.8.21 కోట్లకు పైగా ఆర్థిక సహాయం అందించినట్లు వెల్లడించారు. అదేవిధంగా ఎల్ఓసీ (LOC) ద్వారా 160 మందికి సుమారు రూ.7 కోట్ల మేర సహాయం అందించినట్లు తెలిపారు.

ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలలో ఎలాంటి అవినీతికి తావులేదని, ముఖ్యమంత్రి సహాయనిధి నిధుల దుర్వినియోగానికి పాల్పడటం నేరమని ఆయన స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.

ఆపద సమయంలో పేద కుటుంబాలకు ఆర్థిక చేయూత అందించడం ప్రభుత్వ బాధ్యత అని, వైద్య ఖర్చుల భారం కారణంగా ఏ ఒక్క కుటుంబం ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా సహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు.

మొత్తంగా నర్సాపూర్ నియోజకవర్గంలో వందలాది కుటుంబాలకు వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయనిధి భరోసాగా నిలుస్తుండటంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ASHOK REDDY, NARASAPOOR

ASHOK REDDY, NARASAPOOR