Medak: చరిత్ర ఆనవాళ్లుకు ప్రసిద్ధి మెదక్ పర్యాటక ప్రాంతాలు కలెక్టర్
Medak: పర్యాటక ప్రాంతాల విశిష్టతను చాటిచెప్పేలా ప్రత్యేక డాక్యుమెంటరీ మరియు హెరిటేజ్ పుస్తకాన్ని రూపొందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ వెల్లడించారు.
Medak: చరిత్ర ఆనవాళ్లుకు ప్రసిద్ధి మెదక్ పర్యాటక ప్రాంతాలు కలెక్టర్
మెదక్: 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పర్యాటక వారోత్సవాల సందర్భంగా హెరిటేజ్ వాక్ లో జిల్లా కలెక్టర్ ప్రతిమసింగ్, అదనపు కలెక్టర్ నగేష్, డిఆర్ఓ అంబదాస్ రాజేశ్వర్ ,మెదక్ ఆర్డీవో రమాదేవి, మత్స్యశాఖ అధికారి మల్లేశం యువజన క్రీడల నిర్వహణ అధికారి రమేష్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, డిపిఓ యాదయ్య, ఇరిగేషన్ ఈ .ఈ శ్రీనివాస్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు, వ్యాయామ ఉపాధ్యాయులు, యువత, క్రీడాకారులు, మున్సిపల్ సిబ్బంది తో కలిసి కలెక్టర్ హెరిటేజ్ వాక్ లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముందుగా వెస్లీ పాఠశాలను, మెదక్ చర్చిని, గుల్సన్ క్లబ్ అనంతరం మెదక్ పోర్ట్ సందర్శించి హెరిటేజ్ వాక్ నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చరిత్రకు ఆనవాళ్లు మెదక్ పర్యాటక ప్రాంతాలని . భావితరాలకు మెదక్ చారిత్రాత్మక పర్యాటక ప్రాంతాల ఉనికి అందించేలా డాక్యుమెంటరీ తయారీ చేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు.
మెదక్ జిల్లా సుసంపన్నమైన చారిత్రక మరియు సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉందన్నారు. మెదక్ జిల్లా పర్యాటక ప్రాంతాల. ఉనికి భావితరాలకు అందించేలా జిల్లాలో ఉన్న అన్ని పర్యాటక ప్రాంతాలనుడాక్యుమెంటరీ తయారీ చేస్తున్నట్లు వివరించారు.మెదక్ చర్చ్, ,గోల్ బంగ్లా. బారాకమాన్, మెదక్ పోర్ట్ ఆ ప్రాంతాల సందర్శించి చరిత్రను తెలుసుకోవడం జరిగిందన్నారు.
మెదక్ పోర్ట్ అనేది చారిత్రాత్మక పర్యాటక ప్రాంతంగా పర్యాటకులను ఆకర్షిస్తుందన్నారు మెదక్ పట్టణానికి అత్యంత దగ్గరగా ఉంటుందని పర్యాటకులు తాకిడి ఎక్కువగా ఉంటుందన్నారు హెరిటేజ్ వాక్ లో భాగంగా జిల్లా అధికారులు ఈ ప్రాంతాన్ని సందర్శించడం జరిగిందన్నారు.మెదక్ పోర్ట్ ప్రాంతంలో మరమ్మత్తులకు అవకాశం ఉన్నందున ఈనెల 22 రోజున హెరిటేజ్ ప్రాంతాలను హైలెట్ చేయడంలో భాగంగా మరమ్మత్తులు నిర్వహించి శానిటేషన్ డ్రైవ్, లైటింగ్ ఏర్పాటుచేసి యువతను పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దుతున్నామన్నారు.
జిల్లాలో ఉన్న పర్యాటక ప్రాంతాలను ప్రాధాన్యత భావితరాలకు అందించే విధంగా దృష్టి సారిస్తున్నట్లు వివరించారు అన్ని హెరిటేజ్ ప్రాంతాలను మున్సిపల్ కమిషనర్ జిల్లా పంచాయతీ శాఖ సమన్వయంతో ఒక ప్రణాళిక ప్రకారం జిల్లాలో ఉన్న ఆ ప్రాంతాలలు చరిత్ర పుటల్లోకి ఎక్కిన పర్యాటక ప్రాంతాలైన , బురుజులు, చారిత్రాత్మక దేవాలయాలు, డాక్యుమెంటరీ తయారు చేసి హెరిటేజ్ పుస్తక రూపంలో భద్రపరుస్తున్నట్లు ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు . పర్యాటక ప్రాంతాలలో పర్యాటకులకు రిహాబిటేషన్ సౌకర్యం కల్పించడానికి సిఎస్ఆర్ ఫండ్స్ స్టేట్ లెవెల్ నిధులను దరఖాస్తు చేయిస్తామన్నారు.
భావితరాలకు మెదక్ చరిత్ర పుటల ఉనికి తెలియ జే యాలన్నది దీని యొక్క ముఖ్య ఉద్దేశం గా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులు, యువత, క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




