Narsapur: రైతులు అధైర్య పడొద్దు.. చివరి గింజ వరకూ కొంటాం.. కలెక్టర్

Narsapur: నర్సాపూర్ పరిధిలోని సాయి కృష్ణ రైస్ మిల్‌ను జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

G Ashok Reddy, Narsapur
Published on: 25 May 2026 3:47 PM IST
Narsapur
X

Narsapur: రైతులు అధైర్య పడొద్దు.. చివరి గింజ వరకూ కొంటాం.. కలెక్టర్

Narsapur: సోమవారం నర్సాపూర్ మున్సిపాలిటీలోని సాయి కృష్ణ రైస్ మిల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నర్సాపూర్ లో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డి ఎం సి ఎస్ జగదీష్ ,డి ఎస్ ఓ నిత్యానంద్ తాహాసిల్దార్ శ్రీనివాస్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లను వచ్చే 10 రోజుల్లో పూర్తి చేయడానికి ప్రత్యేక కార్యచరణ రూపొందించామని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు.

కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన అధికారులు పనిచేస్తున్నారని తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం, కొనుగోలు సంస్థలు, రైస్ మిల్లర్లు, రవాణా విభాగాలు సమన్వయంతో యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. రైతులకు వెంట వెంటనే చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా వెంటనే రైస్ మిల్లులకు తరలిస్తూ, లోడింగ్–అన్‌లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని మిల్లర్లకు సూచించారు. వర్షాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ధాన్యం తడవకుండా కొనుగోలు కేంద్రాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటు న్నామని తెలిపారు. అవసరమైన టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచడంతో పాటు అవసరమైతే అదనపు కేటాయింపులు కూడా చేపడుతున్నామని తెలిపారు.

ధాన్యాన్ని వేగంగా మిల్లులకు తరలించడం, లారీలు.. ఇతర రవాణా వాహనాలను సమృద్ధిగా అందుబాటులో ఉంచడం, రైతులకు తాగునీరు, నీడ తదితర మౌలిక సదుపాయాలు కల్పించడం వంటి చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ వివరించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

G Ashok Reddy, Narsapur

G Ashok Reddy, Narsapur

Next Story