Medak: దళితులపై దాడులను అరికట్టాలి తూప్రాన్ ఆర్డీవోకు దళిత సంఘాల వినతి!
Medak: మెదక్ జిల్లాలో దళితులపై దాడులను అరికట్టాలని, నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్. తూప్రాన్ ఆర్డీవో బాబయ్యకు వినతిపత్రం అందజేసిన నాయకులు.
Medak: దళితులపై దాడులను అరికట్టాలి తూప్రాన్ ఆర్డీవోకు దళిత సంఘాల వినతి!
Medak: జిల్లాలో బతుకమ్మ, దసరా ఉత్సవాల సందర్భంగా దళితులపై జరిగిన దాడులకు పాల్పడిన నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుని బాధితులకు రక్షణ కల్పించాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం తూప్రాన్ ఆర్డీవో బాబయ్యకు దళిత బహుజన ఫ్రంట్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి. శంకర్ మాట్లాడుతూ మనోహరాబాద్ మండలం కొనాయిపల్లి, కుచారం, తూప్రాన్ మండలం కిష్టాపూర్, వెంకటాయపల్లి, వెల్దుర్తి మండలం ఎద్దులపల్లి గ్రామాల్లో దళితులపై దాడులు, కులవివక్ష ఘటనలు చోటుచేసుకున్నాయని తెలిపారు. కొనాయిపల్లిలో డప్పులు కొట్టినందుకు కూలీ అడిగిన దళితులపై సర్పంచ్, అతని అనుచరులు దాడి చేశారని, కుచారంలో దళిత సర్పంచ్ భర్తపై దాడి చేశారని ఆరోపించారు. కిష్టాపూర్‌లో దళిత మహిళలను బతుకమ్మ వేడుకలకు దూరం చేస్తూ సాంఘిక బహిష్కరణకు పాల్పడ్డారని పేర్కొన్నారు.
కొనాయిపల్లి ఘటనపై ఎఫ్ఐఆర్ను సవరించి
హత్యాయత్నం కేసు నమోదు చేయాలని, నిందితులను అరెస్టు చేయాలని, సర్పంచ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అట్రాసిటీ కేసుల విచారణలో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, గ్రామాల్లో పౌరహక్కుల దినోత్సవాలు నిర్వహించి కులవివక్షపై అవగాహన కల్పించాలని ఆర్డీవోకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మాలల జేఏసీ నాయకులు మామిడి వెంకటేష్, సామల అశోక్, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు గజ్జల కృష్ణ, మన్నె భాను ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.




