Hatnoora: దౌల్తాబాద్ చౌరస్తాలో రాజీవ్ గాంధీ వర్ధంతి

Hatnoora: సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్ చౌరస్తాలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమం జరిగింది.

ASHOK REDDY, NARASAPOOR
Published on: 21 May 2026 11:56 AM IST
Hatnoora
X

Hatnoora: దౌల్తాబాద్ చౌరస్తాలో రాజీవ్ గాంధీ వర్ధంతి

హత్నూర: సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్ చౌరస్తాలో భారతరత్న, మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఆ మహనీయుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జి రాజి రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ సుహాసిని రెడ్డి గార్లు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ టెలీకాం విప్లవం, కంప్యూటరీకరణతో 21వ శతాబ్దపు భారతానికి దిశానిర్దేశం చేసిన దార్శనికుడని,పంచాయతీరాజ్ ద్వారా గ్రామాలకు అధికారం,18 ఏళ్లకే యువతకు ఓటు హక్కు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేసిన నాయకుడని వారి సేవలను మననం చేసుకుని,రాజీవ్ గాంధీ కలలుగన్న ఆధునిక, సాంకేతిక, సశక్త భారత నిర్మాణమే మనందరి లక్ష్యం కావాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి రవీందర్ యాదవ్, మండలం అధ్యక్షులు కృష్ణ, సర్పంచులు నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

ASHOK REDDY, NARASAPOOR

ASHOK REDDY, NARASAPOOR

Next Story