Narsapur: నర్సాపూర్‌లో వైద్యశాఖ తనిఖీలు అనుమతులు లేని ఆసుపత్రి సీజ్!
Narsapur: నర్సాపూర్‌లో అధికారుల ఆకస్మిక తనిఖీలు: అనుమతులు లేని న్యూ అమ్మ హాస్పిటల్ మూసివేత, రెడ్డిపల్లి పీహెచ్‌సీ పరిశీలన.
Narsapur: నర్సాపూర్‌లో వైద్యశాఖ తనిఖీలు అనుమతులు లేని ఆసుపత్రి సీజ్!
Narsapur: నర్సాపూర్ టు మెదక్ రోడ్డులోని న్యూ అమ్మ చిన్నపిల్లల, జనరల్ హాస్పిటల్ను కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా. గణేశ్వర్ ఆధ్వర్యంలో అధికారులు తనిఖీ చేశారు. ఆస్పత్రి నిర్వహణకు అవసరమైన రిజిస్ట్రేషన్, అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్నట్లు గుర్తించిన అధికారులు ఓపీ, ఐపీ రిజిస్టర్లతో పాటు పేషెంట్ల వివరాలను పరిశీలించారు.
ఆస్పత్రి డాక్టర్ ఎల్. కిరణ్ కుమార్‌ను విచారించి నోటీసులు జారీ చేశారు. వెంటనే ఆస్పత్రిని మూసివేసి, నోటీసుకు గడువులోపు సమాధానం ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. రెడ్డిపల్లి పీహెచ్‌సీలో డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీ.
ఇదిలా ఉండగా.. సెప్టెంబర్ 1న మధ్యాహ్నం రెడ్డిపల్లి పీహెచ్‌సీని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా. గణేశ్వర్ ఆకస్మికంగా సందర్శించారు. సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్, ఓపీ రిజిస్టర్, ఫార్మసీ రూమ్, ఐఎల్‌ఆర్, వ్యాక్సిన్లను పరిశీలించారు. నెలవారీ ఆశా మీటింగ్‌లో పాల్గొని మాతా శిశు సంరక్షణ కార్యక్రమాలపై సమీక్షించారు.
ఎన్‌సీడీ ప్రోగ్రామ్‌కు సంబంధించిన ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రికార్డులు, రిజిస్టర్ల నిర్వహణను పరిశీలించారు. మలేరియా, డెంగీ, టైఫాయిడ్, వైరల్ ఫీవర్స్ వంటి సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానిత కేసులకు ల్యాబొరేటరీ పరీక్షలు నిర్వహించి సకాలంలో చికిత్స అందించాలని సిబ్బందికి సూచించారు.
పీహెచ్‌సీలో అవసరమైన మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని డా. గణేశ్వర్ ఆదేశించారు. ఈ తనిఖీల్లో మెడికల్ ఆఫీసర్ డా. రఘు వరణ్, డెమో అన్వర్, సీహెచ్‌ఓ, హెల్త్ సూపర్‌వైజర్, పీహెచ్‌సీ సిబ్బంది పాల్గొన్నారు.




