Gummadidala: దోమడుగులో ఘనంగా మహాలక్ష్మి హోమం, అన్నప్రసాద వితరణ
Gummadidala: దోమడుగులో దుర్గమ్మకు ఘనంగా మహాలక్ష్మి హోమం, అన్నప్రసాద వితరణ. హాజరైన జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటా సుధా శ్రీనివాస్ గౌడ్, నాయకులు.
Gummadidala: దోమడుగులో ఘనంగా మహాలక్ష్మి హోమం, అన్నప్రసాద వితరణ
గుమ్మడిదల: మున్సిపల్ ప్రజలను చల్లగా చూడమ్మా.. ప్రతి కష్టసుఖంలో అండగా నిలుస్తూ ధైర్యాన్ని ప్రసాదించమ్మా అంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, దోమడుగు గ్రామ మాజీ ఎంపీటీసీ గోవర్ధన్ గౌడ్ ఆకాంక్షించారు.
గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని దోమడుగు గ్రామంలో గత పది సంవత్సరాలుగా గోవర్ధన్ గౌడ్ ఆధ్వర్యంలో దేవి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో భాగంగా శనివారం దుర్గమ్మకు దేవి నవరాత్రిలలో భాగంగా మహాలక్ష్మి హోమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటా సుధా శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పరమేశం, ఎస్ఐ అరుణ్ కుమార్ గౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చిన్నపాపని కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పుట్ట నర్సింగ్ రావు, మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్, వీరభద్రస్వామి దేవాలయ కమిటీ మాజీ చైర్మన్ మద్ది ప్రతాప్ రెడ్డి, నాయకులు మద్ది వీరారెడ్డి, చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, వార్డు కౌన్సిలర్లు అభి శెట్టి రాజశేఖర్, మద్ది సోనీ శేఖర్ రెడ్డి, బ్యాగరి వరలక్ష్మి కృష్ణ, సురభి కుమార్ గౌడ్, కత్తుల రమేష్, నాయకులు తులసీదాస్, మంగయ్య, వెంకట్రాం రెడ్డి, పొన్నాల శ్రీనివాస్ రెడ్డి, తుపాకుల రాజు, భక్తులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.




