Medak: రోస్టర్ పాయింట్స్ ను సవరించి మాలలకున్యాయం చేయాలి

Medak: మెదక్ జిల్లా సదస్సులో మాలల కోఆర్డినేషన్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ఎం.ఎఫ్. గోపీనాథ్ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

NAGARAJ, MEDAK
Published on: 14 Jun 2026 3:02 PM IST
Medak
X

Medak: రోస్టర్ పాయింట్స్ ను సవరించి మాలలకున్యాయం చేయాలి

మెదక్: ఎస్సీ వర్గీకరణ లో మాలలకు కేటాయించిన పోస్టల్ పాయింట్లను సవరించి న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాలల కోఆర్డినేషన్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ఎం ఎఫ్ గోపీనాథ్ డిమాండ్ చేశారు. ఆదివారం నాడు మెదక్ టీఎన్జీవో భవన్ లో జెల్ల సుధాకర్ అధ్యక్షతన మాలల కోఆర్డినేషన్ ఫోరం ఆధ్వర్యంలో మాల ల సవరించాలని జిల్లా స్థాయి సదస్సు జరిగింది. ఈ సదస్సులో ముఖ్యఅతిథిగా డాక్టర్ గోపీనాథ్ పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా గోపినాథ్ మాట్లాడుతూ మాలల పైన జరుగుతున్న కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. వర్గీకరణ తర్వాత మాలలకు విద్య ఉద్యోగాలు నియామకాలలో తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ లో మాలలకు ఒక్క ఉద్యోగం కూడా లభించలేదని తెలిపారు. రాజ్యాంగబద్ధంగా మాలలకు రావలసిన వాట రాకుండా పాలకవర్గాలు ప్రభుత్వము కుట్ర చేస్తుందని ఆరోపించారు.

మాలలకు కేటాయించిన రోస్టర్ పాయింట్లను 22 నుంచి 16కు సవరించి ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయాలని డిమాండ్ చేశారు. మాలలకు జరుగుతున్న అన్యాయం పైన మాల ప్రజా ప్రతినిధులు నోరు ఇవ్వకపోతే వారి ఇంటిని ముట్టడించి న్యాయమైన హక్కులను సాధించుకుంటామని హెచ్చరించారు. మాజీ మంత్రి సుద్దాల దేవయ్య మాట్లాడుతూ వర్గీకరణ వ్యతిరేకించిన పాపానికి నాటు చంద్రబాబు నాయుడు మంత్రివర్గం నుంచే తొలగించాలని ఆవేదన వ్యక్తం చేశారు.

వర్గీకరణ వల్ల మాలలకు జరుగుతున్న అన్యాయంపై ముఖ్యమంత్రికి విన్నవించగా సానుకూలంగా స్పందించాలని తెలిపారు. జరుగుతున్న ఈ సమావేశంలో మాలల కోఆర్డినేషన్ ఫోరం రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు శకుంతల, డాక్టర్ తిరుపతయ్య, వెంకయ్య, ప్రొఫెసర్ వెంకట దాసు, హైకోర్టు న్యాయవాది పద్మారావు, బాల చందర్ వివిధ సంఘాల నాయకులు శంకర్, కల్లూరి సంజీవ్, మైసయ్య, పెంటయ్య, దుబాసి సంజీవ్, సామల అశోక్. బొమ్మల మైసయ్య యాదగిరి.తదితరులు పాల్గొన్నారు.

NAGARAJ, MEDAK

NAGARAJ, MEDAK

Next Story