Dubbaka: దుబ్బాక దేవి మండపం వద్ద ఐపీఎస్ అధికారుల ఫ్లెక్సీ!
Dubbaka: దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో యువ కిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ వినూత్న ప్రయోగం చేసింది. 12 మంది ఐపీఎస్ అధికారుల ఫ్లెక్సీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Dubbaka: దుబ్బాక దేవి మండపం వద్ద ఐపీఎస్ అధికారుల ఫ్లెక్సీ!
Dubbaka: పండుగలు కేవలం ఆధ్యాత్మిక వేడుకలకే పరిమితం కాకుండా.. సమాజానికి మంచి సందేశాన్ని అందించే వేదికలుగా మారాలన్న ఆలోచనకు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని యువ కిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు కార్యరూపం ఇస్తున్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏటా వినూత్న రీతిలో మండపాన్ని ఏర్పాటు చేస్తూ భక్తుల్లో భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు సామాజిక బాధ్యతపై అవగాహన కల్పిస్తున్నారు.
ఈసారి తెలంగాణలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కృషి చేస్తున్న 12 మంది ఐపీఎస్ అధికారుల చిత్రాలతో ఫ్లెక్సీని ఏర్పాటు చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.దుబ్బాక పట్టణంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయంటే యువ కిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసే మండపాన్ని సందర్శించేందుకు భక్తులు ఆసక్తి చూపుతుంటారు.




