Medak: ఏడుపాయల ఆలయంలో గాయత్రీ దేవి అవతారంలో భవానీ మాత దర్శనం!

Medak: మెదక్ ఏడుపాయల వన దుర్గాభవానీ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు. రెండో రోజు గాయత్రీ దేవి (బ్రహ్మచారిణి) అవతారంలో అమ్మవారి దర్శనం, ఉచిత అన్నదానం.

NAGARAJ, MEDAK
Published on: 12 Oct 2026 3:39 PM IST
Medak
X

Medak: ఏడుపాయల ఆలయంలో గాయత్రీ దేవి అవతారంలో భవానీ మాత దర్శనం!

Medak: ఏడుపాయల వన దుర్గాభవానీ మాత ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి.ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన సోమవారం అమ్మవారు భక్తులకు గాయత్రీ దేవి (బ్రహ్మచారిణి) రూపంలో భక్తులకు కనువిందు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణల నడుమ అమ్మవారికి విశేష అభిషేకాలు, కుంకుమార్చనలు, శాస్త్రోక్త పూజలు ఘనంగా నిర్వహించారు.వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల కన్ను గుణంగా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది ఆలయ ఈఓ వీరేశం తెలిపారు భక్తులందరికీ ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఈవో తెలిపారు.

NAGARAJ, MEDAK

NAGARAJ, MEDAK