Andole: నీరందక ఎండిపోతున్న పంటలు: రైతుల ఆందోళన!

Andole: సంగారెడ్డి జిల్లా టేక్మాల్‌లో ఎండిన వరి పంటలను మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పరిశీలించారు. నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

UMASHANKAR, ANDOLE
Updated on: 29 Oct 2026 7:08 PM IST
Andole
X

Andole: నీరందక ఎండిపోతున్న పంటలు: రైతుల ఆందోళన!

Andole: సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలో సాగునీరు అందక వరి పంటలు ఎండిపోతుండటంతో రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతోంది. టేక్మాల్ మండలం పరిధిలోని పలు గ్రామాల్లో ఎండిపోయిన వరి పంట పొలాలను అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

చేతికందివచ్చిన పంట కళ్లముందే ఎండిపోతుంటే రైతులు పడుతున్న ఆవేదనను ఆయన అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించి తక్షణమే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

టేక్మాల్ మండలం కుసంగి సహా పలు గ్రామాల్లో ఈ ఏడాది వరి సాగు చేసిన రైతులకు తీవ్ర నిరాశే ఎదురైంది. పంట చివరి దశకు చేరుకుని, చేతికొచ్చే సమయంలో నీరందక వరి పొలాలు పూర్తిగా ఎండిపోయాయి. దీంతో పెట్టుబడులు పెట్టిన రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు.

ఈ విషయం తెలుసుకున్న అందోల్ మాజీ శాసనసభ్యులు చంటి క్రాంతి కిరణ్ బాధితులను పరామర్శించేందుకు స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లారు. ఎండిపోయిన పంట పొలాల్లోకి వెళ్లి పరిశీలించిన ఆయన, రైతులతో మాట్లాడి వారి కష్టాలను, నష్టాలను అడిగి తెలుసుకున్నారు.

లక్షలాది రూపాయలు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టామని, చివరి నిమిషంలో పంట ఎండిపోవడంతో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని రైతులు మాజీ ఎమ్మెల్యే వద్ద కన్నీరుమున్నీరయ్యారు.

UMASHANKAR, ANDOLE

UMASHANKAR, ANDOLE