Narsapur: గుడుంబా తయారీపై ఎక్సైజ్ దాడులు.. ఒకరి అరెస్ట్

Narsapur: నర్సాపూర్ పరిధిలో ఎక్సైజ్ అధికారులు దాడులు చేసి భీమ్లా తండాలో గుడుంబా తయారీదారుడిని అరెస్ట్ చేయడంతో పాటు రెండు బెల్ట్‌షాపులపై కేసులు నమోదు చేశారు.

ASHOK REDDY, NARASAPOOR
Published on: 24 Oct 2026 9:49 PM IST
Narsapur
X

Narsapur: గుడుంబా తయారీపై ఎక్సైజ్ దాడులు.. ఒకరి అరెస్ట్

మెదక్ జిల్లా: నర్సాపూర్ పరిధిలో అక్రమ మద్యం తయారీ, విక్రయాలపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు కొరడా ఝుళిపించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక తనిఖీలు, దాడులు నిర్వహించి గుడుంబా తయారీకి పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేయడంతో పాటు, అక్రమంగా మద్యం విక్రయిస్తున్న రెండు బెల్ట్‌షాపులపై కేసులు నమోదు చేశారు.

శివంపేట మండలం పంబండ గ్రామ సమీపంలోని భీమ్లా తండా పరిసర ప్రాంతంలో అక్రమంగా గుడుంబా తయారు చేస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారంతో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఒక నిందితుడిని అరెస్ట్ చేసి, రెండు లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. గుడుంబా తయారీకి సిద్ధంగా ఉంచిన 30 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు.

మరోవైపు, అనధికారికంగా ఐఎంఎల్ మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో రెండు బెల్ట్‌షాపులపై అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తున్నట్లు గుర్తించి రెండు కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా 4.32 లీటర్ల ఐఎంఎల్ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

డిప్యూటీ కమిషనర్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ, మెదక్ డివిజన్, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ గులాం ముస్తఫా పర్యవేక్షణలో ట్రైనీ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ జ్ఞానేశ్వర్, ఎస్‌ఐ డి. శరత్ కుమార్, ట్రైనీ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ సచిరథ, ఎక్సైజ్ సిబ్బంది రవి, హెడ్ కానిస్టేబుల్ స్వామి, కానిస్టేబుళ్లు మహేశ్ కుమార్, షాహిద్, రాజశేఖర్ తదితరులు ఈ దాడుల్లో పాల్గొన్నారు.

అక్రమ మద్యం తయారీ, విక్రయాలపై కఠిన చర్యలు!

గుడుంబా తయారీ, అక్రమ మద్యం విక్రయాలు లేదా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు. అక్రమ మద్యం తయారీ, విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే ప్రజలు ఎక్సైజ్ శాఖ అధికారులకు తెలియజేయాలని కోరారు.

ASHOK REDDY, NARASAPOOR

ASHOK REDDY, NARASAPOOR